https://oktelugu.com/

Are You Unhappy: మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే 10 రోజులు వేతనంతో కూడిన సెలవు తీసుకోండి.. ఓ కంపెనీ బంపర్ ఆఫర్..

ప్రైవేట్ జాబ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. ఎందుకంటే వేతనం తక్కువ.. పని ఎక్కువ.. అని కొందరి భావన. శ్రామిక దోపిడీ ఎక్కువగా ఉండడంతో పాటు అధికంగా సమయం వెచ్చించాల్సి ఉటుంది. సాధారణంగా ఒక కార్యాలయంలో 8 నుంచి 10 గంటల వరకు పని చేస్తారు. కానీ కొన్ని కంపెనీలు 16 నుంచి 18 గంటల వరకు పని చేయాలనే నిబంధనలు విధిస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 20, 2024 / 05:55 PM IST

    Unhappy-Life

    Follow us on

    Are You Unhappy: ప్రైవేట్ జాబ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. ఎందుకంటే వేతనం తక్కువ.. పని ఎక్కువ.. అని కొందరి భావన. శ్రామిక దోపిడీ ఎక్కువగా ఉండడంతో పాటు అధికంగా సమయం వెచ్చించాల్సి ఉటుంది. సాధారణంగా ఒక కార్యాలయంలో 8 నుంచి 10 గంటల వరకు పని చేస్తారు. కానీ కొన్ని కంపెనీలు 16 నుంచి 18 గంటల వరకు పని చేయాలనే నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ జాబ్స్ మానేసి సొంతంగా చిన్నగా అయినా వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. ఎక్కువ పని గంటల వల్ల ఉద్యోగుల తీవ్రంగా అలసిపోతున్నారని.. దీంతో సరైన విధంగా పనిచేయడం లేదని గ్రహించిన ఓ కంపెనీ మనసు బాగో లేకపోతే 10 రోజుల వరకు సెలవు తీసుకోండి.. అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకీ ఈ కంపెనీ ఏదో తెలుసా?

    ఉదయం లేవగానే నిర్దిష్ట సమయంలో కార్యాలయంలో లేకపోతే బాస్ ఒప్పుకోడు. దీంతో ఉరుకులు.. పరుగులు.. అన్నట్లగా ఉద్యోగులు బిజీ లైఫ్ ను కలిగి ఉంటారు.ఈ కారణంగా వీరు తీవ్రంగా అలసిపోతారు. అయితే చైనాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ ఉద్యోగుల బాధను అర్థం చేసుకుంది. దీంతో వారికి మంచి అవకాశం ఇచ్చింది. చైనాలోని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు నివేదిక ప్రకారం.. ‘పాంగ్ డాంగ్ లై’ అనే కంపెనీ వ్యవస్థాపకుడు యు డోంగ్లాయ్ తమ ఉద్యోగులకు అసంతృప్త సెలవులను ప్రకటించాడు. ఇవి వార్షికంగా 20 నుంచి 40 రోజుల వరకు తీసుకోవచ్చని తెలిపాడు. సాధారణంగా ఉండే వీక్లీఆఫ్, తదితర సెలవులతో పాటు ఇవి అదనంగా ఉంటాయి. ఎప్పుడైతే ఉద్యోగులు అసంతృప్తంగా ఉన్నారని కార్యాలయానికి తెలియజేస్తే వారికి 10 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు.

    ఈ సందర్భంగా కంపెనీ అధినేత యు డోంగ్లాయ్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నతే తమ ధ్యేయం. ఉద్యోగులు సంతోషంగా లేకుండా సరిగ్గా పనిచేయలేరు. అందువల్ల సెలవులు తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారిన తరువాత కార్యాలయానికి రావొచ్చు’ అని ఆయన పేర్కొన్నాడు. 2021లో చైనాలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 65 శాతం ఉద్యోగులు పనిస్థలాల్లో తీవ్రంగా అలసిపోతున్నట్లు తెలిపింది. అయితే చైనా తరువాత ఇతర దేశాల్లోని కొన్ని కంపెనీలు కూడా ఈ విధానాన్ని అమలు చేసి విజయవంతం అయ్యాయి. కొన్ని రోజుల పాటు రిలాక్స్ కోసం సెలవులు ఇవ్వడం వల్ల వారిలో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. దీంతో వారు సమర్థవంతంగా పనిచేస్తారు అని పేర్కొన్నారు. అయితే ముందు ముందు ఇంకా ఏ దేశాల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తారో చూడాలి.

    ఒకవేళ సిబ్బందిపై నిరంతరాయంగా పని ఒత్తిడి చేస్తే వారు ఉద్యోగాన్ని వదులుకునే అవకాశాలు ఎక్కువా ఉన్నాయని గుర్తించారు. ఈ తరుణంలో ఇండియాకు చెందిన ఇన్ఫోసిస్ కంపెనీ సైతం వారంలో 70 గంటలు మాత్రమే పనిచేయాలనే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కొంతమంది సమర్థించగా..మరికొందరు మాత్రం వ్యతిరేకింగారు. నేటి డిజిటల్ యుగంలో ఇది సాధ్యం కాదన్నట్లు తెలిపారు.