Sleep twitching causes: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర కూడా అవసరమే. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు చదువుతో.. ఉద్యోగానికి వెళ్లేవారు పని ఒత్తిడిని.. వ్యాపారస్తులు వ్యాపారం గురించి నిత్యం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన మెదడుపై ప్రభావం చూపి రాత్రి పడుకునే సమయంలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా ఈ ఆలోచనలన్నీ ఒకటిగా మారి మెదడులో కొత్త రకమైన సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల్లో భాగంగా నిద్రలో జారుకున్నట్టే జారుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం.. ఒకసారిగా గట్టి శబ్దాలు వినిపించినట్లు అవడం.. కెమెరా ఫ్లాష్ మొఖంపై ఉన్నట్లు అనిపించడం.. వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడాన్ని Exploding Syndrome అని అంటారు. ఈ ఎక్స్లోడింగ్ సిండ్రోమ్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి? వీటి లక్షణాలు ఏంటి?
రాత్రి సమయంలో ఒక మనిషి నిద్రలోకి జారుకునే సమయంలో ఉండే అనుభవాన్ని పారాసోమ్నీయా.. అంటారు.. ఈ పారాసోమ్నీయా.. సాధారణంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది. కానీ ఈ సమయంలో తలలో ఒక పెద్ద శబ్దం వచ్చినట్లు.. బాంబు పేలినట్లు. ఎవరో పిలిచినట్లు అనిపించేదాన్ని ఎక్స్ప్లోడింగ్ సిండ్రియా అంటారు. అయితే శబ్దాలు, మెరుపు లాంటివి అనిపించిన అవి బయట నిజంగా జరగవు. ఇవి మానసికంగా జరిగే సంఘర్షణలు మాత్రమే. అయితే ఇలా జరగడానికి కారణం మానసికంగా ఒత్తిడిగా ఉండడమే. రోజంతా కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో అలసిపోయిన తర్వాత ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు శరీరానికి సరిపోని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా సందర్భంలో పెద్ద శబ్దం విన్నవారు కూడా ఇలా నిద్రపోయే సమయంలో మళ్ళీ మళ్ళీ వింటారు. నిద్రలోకి జారీ సమయంలో సరైన వాతావరణం లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.
Exploding Syndrome ఒక రకమైన వ్యాధి కాకపోయినా. మానసికంగా సంఘర్షణ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అయితే ఒకసారి నిద్రలోకి వెళ్లే ముందు ఇలాంటి శబ్దాలు లేదా కెమెరా ఫ్లాష్ వంటివి కనిపిస్తే.. మరోసారి నిద్రపోవడానికి భయపడుతూ ఉంటారు. లేదా నిద్రపోయే సమయంలో ఏదో జరుగుతుందని భయం ఉంటుంది. చాలా కాలం పాటు నిద్రలేమి సమస్యతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. శారీరకంగా ఎటువంటి నష్టం లేకపోయినా.. మెదడులో మాత్రం దీర్ఘకాలికంగా సంఘర్షణలు ఉంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.
ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రత్యేకంగా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. యోగ లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలి. నిద్రించే ముందు కాఫీ, టి వంటి పానీయాలను తాగడం మానేయాలి. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల సరైన నిద్ర పోయే అవకాశం ఉంటుంది.