Sports Bike: మార్కెట్లోకి ఎన్ని 4 వీలర్స్ వచ్చినా.. బైక్ రైడింగ్ చేయాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందుకే ఏ కొత్త బైక్ వచ్చినా వాటిని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు నిత్యం కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. లేటేస్టుగా కొన్ని బైక్ లు రిలీజజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ కి రావడంతో వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. ఆ బైక్ లు ఎలా ఉన్నాయంటే?
2024 సంవత్సరంలో చాలా బైక్ లు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కొన్ని యూత్ ను ఆకర్షించే విధంగా ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువైనా స్టైలిష్ లుక్ లో ఆకర్షిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది KTM 490 డ్యూక్. ఇది ఒక స్పోర్ట్స్ బైక్. దీనిని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. 490 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ధర రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. 2019లో KTM స్టీఫన్ పీరర్, సబ్ బ్రాండ్ 500 సీసీ ట్విన్ సిలిండ్ పనిచేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇది 490 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది.
ప్రముఖ కంపెనీ కవాసకీ లేటేస్టుగా Z400మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనిని రూ.4 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. దీనిని నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు. మరో కంపెనీ బెనెల్లీ నుంచి TNT300 నవంబర్ లో రోడ్లపైకి రానుంది. 300 సీసీ ఇంజిన్ ను కలిగిన ఈ బైక్ నవంబర్ లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని రూ.3.5 లక్షల తో విక్రయించనున్నారు.
హోండా కంపెనీ నుంచి యాక్టివా 7G త్వరలో మార్కెట్ లోకి రానుంది. ఇది 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది ఏప్రిల్ 15న విడుదల కానుంది. దీనిని రూ.80 వేల నుంచి రూ.90 వరకు ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. యూత్ ఎక్కువగా లైక్ చేసే యమహా నుంచి ఎక్స్ ఎస్ ఆర్ 155 రానుంది. ఇది 155 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.1.4 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. దీనిని డిసెంబర్ వరకు విడుదల చేసే అవకాశం ఉంది.