Immunity Boosters: పరగడుపున ఇవి తీసుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

ఉసిరికాయలు ఎక్కువగా నవంబర్ లో కనిపిస్తాయి. ఈ సమయంలో ఉసిరితో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరికాయలతో స్నానం చేయడం వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా అని కొందరు చెబుతూ ఉంటారు.

Written By: Raj Shekar, Updated On : September 29, 2023 5:16 pm

Immunity Boosters

Follow us on

Immunity Boosters: ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహార అలవాట్లను క్రమ పద్ధతిలో పాటించాలి. కానీ నేటి స్పీడ్ జనరేషన్ లో విధులపై వెచ్చించినంత సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించడం లేదు. ఫలితంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. చాలా మంది ఎనర్జీ కోసం ఏవేవో ఫుడ్స్ తీసుకుంటారు.. కొందరు ప్రత్యేకంగా మెడిసిన్ యూస్ చేస్తారు. కానీ ఇంట్లోనే అసలైన ఆరోగ్యం ఉందన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధులు రాకుండా చేస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

ఉసిరికాయలు ఎక్కువగా నవంబర్ లో కనిపిస్తాయి. ఈ సమయంలో ఉసిరితో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరికాయలతో స్నానం చేయడం వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా అని కొందరు చెబుతూ ఉంటారు. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కేవలం కార్తీక మాసం లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఉసిరికి వాడొచ్చు.పరగడుపున ఉసిరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలను బయటకు నెట్టేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉసిరికాయలు వేసుకొని తాగాలి. అలాగే ఉసిరిని నేరుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ వండే కూరల్లో వెల్లుల్లిని తప్పకుండా వేస్తారు.. వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుంది. కొన్ని పదార్థాల్లో వెల్లుల్లితో తాలింపు చేయడం వల్ల ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పరగడుపున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. ఇది జలుబు,దగ్గుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా కాపాడుతుంది. అయితే వెల్లుల్లిని నేరుగా తీసుకోవడం వల్ల ఎంతో చేదుగా ఉంటుంది. కానీ పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆ తరువాత గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

ఇవే కాకుండా తులసి ఆకులు కూడా గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు ను నివారించవచ్చు. కొన్ని తులసి ఆకులను తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఈ నీటిని తీసుకోవడం తో పాటు తులసి ఆకులను నమలాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా తులసి రసం తాగడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిలో తేనెని తీసుకోవడం వల్ల అరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.