Relationship : బంధంలో కలహాల వల్ల బాధ పడుతున్నారా.. ఇలా బయటపడండి

దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే అనుబంధాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చిన వాటి నుంచి బయటపడాలి. అప్పుడే మనసులో ఉన్న బాధ కాస్త తగ్గుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం.

Written By: Neelambaram, Updated On : September 14, 2024 5:49 pm

Relationship

Follow us on

Relationship :  ప్రతి బంధంలో సమస్యలు అనేవి సహజం. చిన్న విషయాలకి కూడా గొడవలు పడి బంధాలను కోల్పోతున్నారు. ఇలా విడిపోయినప్పుడు ఆ బాధ ఎవరితో కూడా చెప్పుకోలేరు. చెప్పుకుంటే భారం తగ్గడం కంటే.. వాళ్ల దగ్గర చులకన అయిపోతామనే ఉద్దేశంతో కొందరు మనసులోనే ఉంచుకుని ఆవేదన చెందుతారు. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే అనుబంధాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చిన వాటి నుంచి బయటపడాలి. అప్పుడే మనసులో ఉన్న బాధ కాస్త తగ్గుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం.

గుర్తు తెచ్చుకుని మరి బాధపడతారు
చాలా మంది జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధ పడుతుంటారు. తప్పు చేసింది అవతలి వాళ్లు అనే ఫీలింగ్ లోనే ఉంటారు. కనీసం నిజం ఏంటో తెలియక వాళ్లే నిజం అనుకుంటుంటారు. ఏ బంధంలో అయిన ఇద్దరి తప్పులు ఉంటాయి. కేవలం ఒక్కరి తప్పు అయితే ఉండదు. కాబట్టి మన తప్పులు ఏంటో తెలుసుకుని రియలైజ్ అవ్వాలి. అప్పుడే కొంచెం భారం తగ్గుతుంది.

మీ బాధను రాసుకోండి
మీ బంధం దూరమైనందుకు మీకు బాధగా అనిపిస్తే.. ఒక పేపర్ తీసి దానికి గల కారణాలను రాసుకోండి. మళ్లీ వీటిని ఒకసారి చదివితే మీ బాధని షేర్ చేసుకునే ఫీలింగ్ కలుగుతుంది. ఇలా పేపర్ పైన రాసుకోవడం వల్ల కొంతవరకు బాధ అనేది తగ్గుతుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.

షేర్ చేసుకుంటేనే సంతోషం
లైఫ్ లో ఎంత డబ్బు సంపాదించినా.. మన బాధని షేర్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి. మీకు బాగా నమ్మకమైన వ్యక్తితో చెప్పుకుంటే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. లేకుండా మీరే మనసులో బాధ పడుతూ ఉంటే ఇంకా పెరుగుతుంది.

లిమిట్స్ లో ఉండాలి
చాలామంది వాళ్ల లిమిట్స్ దాటి ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారు. దీనివల్ల విడిపోయిన తరువాత చాలా బాధ పడతారు. కాబట్టి ఎవరి లిమిట్స్ లో వాళ్లు ఉండటం బెటర్. అలాగే ఎదుటి వాళ్లని హర్ట్ చేసే విధంగా మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. మనం అనే మాట వాళ్ల ఎదుట వాళ్లు హర్ట్ కాకుండా లిమిట్స్ లో మాట్లాడాలి.

నచ్చిన పని చేయండి
మనకి నచ్చిన పని ఏదైనా చేస్తే.. కొంతవరకు బాధని మర్చిపోతారు. మీకు ఏం ఇష్టమే అవే చేయండి. కొందరికి వంట చేయడం, బయటికి వెళ్లడం ఇష్టం. ఇలాంటివి చేస్తుంటే మీరు తొందరగా బాధ నుంచి బయట పడతారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోండి. ఇవి కూడా మీకు బాధ నుంచి బయటకు వచ్చే విధంగా ఉపయోగపడుతుంది.