Japanese students: చాలామంది పిల్లలు చెబుతున్న సమస్య ఏంటంటే.. తాము ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదు అని అంటూ ఉంటారు. ఎంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్న కూడా.. చాప్టర్ను మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇలా గుర్తు ఉండకపోవడానికి వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చు. లేదా ఆహార పద్ధతులు కావచ్చు. అయితే కారణాలు ఏవి ఉన్నా వారికి చదివింది గుర్తుండడానికి కొన్ని టెక్నిక్స్ పాటిస్తే చాలు. జపాన్ కు చెందిన విద్యార్థులు కూడా ఇదే టెక్నిక్స్ పాటించి 15 నిమిషాల్లో ఒక పాఠం మొత్తం మైండ్లో స్టోర్ చేసుకుంటారు. ఇంతకీ జపాన్ విద్యార్థులు ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తారు?
Kaidan hosiki: ఈ విధానం ద్వారా విద్యార్థులు ఒక చాప్టర్లు తీసుకుని దానిని చిన్నచిన్న భాగాలుగా విభజిస్తారు. ముందుగా ఒక ప్రధాన భాగాన్ని తయారుచేసి మిగతా వి చిన్నచిన్నవిగా తయారు చేసుకుంటారు. ఇలా ఫస్ట్ 3 నిమిషాల్లో ఆ పని చేస్తారు.
Visualization & mnemonics: ఒక చాప్టర్ను పార్ట్స్ గా విభజించిన తర్వాత ఈ చాప్టర్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాలను ఒక పిక్చర్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు ఒక జంతువుకు సంబంధించిన స్టోరీ అయితే ఆ జంతువు ఫిగర్ ను వేసుకుంటారు. ఇలా బొమ్మలు వేయడం ద్వారా వీరి మైండ్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. దీనిని 6 నుంచి 8 నిమిషాల పాటు చేస్తారు.
Active Recall: ఇప్పటివరకు చదివింది లేదా బొమ్మలు గీసింది గుర్తుపెట్టుకోవడానికి 9 నిమిషాల పాటు బుక్ మూసివేసి హిమాజిన్ చేసుకోవాలి. అంటే ఇప్పటివరకు ఏం చేశారో దానిని రిపీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మా ఇంట్లో ఇమేజెస్ ఫిక్స్ అయిపోతాయి.
Ondoku: ఒక పాఠం లో ఉన్న ముఖ్యమైన పదాలను గట్టిగా చెప్పడం ద్వారా మన మైండ్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. ఈ ఇంపార్టెంట్ పదాలు ఎప్పుడు గుర్తుకు వచ్చిన ఈ చాప్టర్ మొత్తం మైండ్లో డిస్ప్లే అవుతుంది.
Jiko Setsumi: ఈ విధానంలో మీరు ఇదివరకు చదివింది ఇతరులకు చెప్పినట్లు.. లేదా పక్కనే మరో వ్యక్తికి చెబుతున్నట్లు రివ్యూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పాఠం మరోసారి గుర్తుండిపోతుంది.
ఈ విధంగా ఐదు పద్ధతులను ఉపయోగించి చదివిన పాఠం గుర్తుంచుకోవచ్చు. చాలామంది బట్టీ పట్టి మరీ చదువుతూ ఉంటారు. ఇలా చదవడం వల్ల కొన్ని చాప్టర్లు మాత్రమే ఫిక్స్ అయిపోతాయి. కానీ ఇలా టెక్నిక్ గా చదవడం వల్ల బుక్ మొత్తం మైండ్లో ఉండిపోతుంది. అప్పుడు ఎలాంటి చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ కు సంబంధించిన విషయాలను వెంటనే గుర్తుకు వస్తాయి. ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు చదివింది గుర్తులేదని బాధపడుతున్నారు. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి ప్రయోగించినా.. చదివింది గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది.