https://oktelugu.com/

Giving Up Alcohol: మద్యం మానేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!!

ప్రస్తుత జనరేషన్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తున్నారు. పురుషులతో పాటే మహిళలు కూడా మద్యం తాగుతున్నారు. స్టూడెంట్లు కూడా మద్యం అలవాటు చేసుకుంటున్నారు. వీకెండ్ పార్టీలంటూ మద్యం బాటిళ్లు ముందు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 12, 2024 / 02:50 PM IST

    Giving-Up-Alcohol

    Follow us on

    Giving Up Alcohol: ప్రస్తుత జనరేషన్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తున్నారు. పురుషులతో పాటే మహిళలు కూడా మద్యం తాగుతున్నారు. స్టూడెంట్లు కూడా మద్యం అలవాటు చేసుకుంటున్నారు. వీకెండ్ పార్టీలంటూ మద్యం బాటిళ్లు ముందు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కూర్చొని ఎవరు అంత తాగుతున్నారో తెలియకుండా బాటిళ్లకు బాటిళ్లు ఖాళీ చేస్తున్నారు. ఇక ఏదైనా ఫంక్షన్లు వచ్చాయంటే తెల్లవారే వరకూ పార్టీలు నడుస్తూనే ఉన్నాయి. మరికొందరైతే నిత్యం మద్యం తాగకుండా ఉండలేరు. నిత్యం ఇంతఅంతా అని లేకుండా తాగుతూనే ఉంటారు. అయితే.. అతిగా మద్యం తాగడం ప్రమాదమే.. తాగితాగి మద్యం మానేయడమూ ప్రమాదమే అని సూచిస్తున్నారు వైద్యులు. అవునండీ.. మద్యం ఒక్కసారిగా మానేస్తే కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది. కానీ.. మద్యం తాగడం మానేసిన తర్వాత కూడా కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తున్నాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తుంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు, అలసట కనిస్తున్నాయట. అదే సమయంలో కొన్నేళ్ల నుంచి మద్యం తాగి మానేయడం వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతున్నాయని తెలుస్తోంది. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో కూడా తెలియని పరిస్థితుల్లోకి జారుకుంటున్నారట.

    మద్యం రోజూ తాగినా.. ఎప్పుడో ఒకసారి తాగినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది అందరికీ తెలిసిందే. మద్యం తాగాక నేరుగా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ.. అది శరీరంలోని ఎన్ని భాగాల మీద ప్రభావం చూపుతుందనేది తెలుసుకోవడం లేదు. ఆల్కహాల్ తాగిన తర్వాత ముందుగా అది చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అది అల్డిహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది. తద్వారా పొట్ట, పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. రక్తం ద్వారా కాలేయానికి చేరుకొని.. కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అయితే.. కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే మంచిదేనని వైద్యులు కూడా చెబుతున్నారు. రోజుకు 30 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా సురక్షితమని పేర్కొంటున్నారు. దాని వల్ల పెద్దగా నష్టం ఉండబోదని సూచిస్తున్నారు.

    అయితే.. దీర్ఘకాలంగా మద్యం తాగుతున్న వారు ఒక్కసారిగా మద్యాన్ని మానేస్తున్నారు. అలా మానేసినప్పటికీ కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు అంటున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలిదశలో మద్యం తాగడం మానేస్తే కాలేయం మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. ఆల్కహాల్ మానేసినప్పటికీ వైద్యం తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. అలాగే.. మద్యం మానేయడం వల్ల మరికొన్ని లాభాలనూ సూచించారు. మద్యం తాగడం మానేశాక కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. సమస్యలను దూరం చేస్తుంది. నిద్ర మెరుగుపడుతుంది. నిద్ర మరింత డీప్‌గా పోవచ్చు. ఇది శరీరానికి, మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. రోగనిరోధక శక్తి వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యా్న్ని పెంచుతుంది. అలాగే.. ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా వేగం అవుతుందట. బరువు తగ్గడానికి కూడా దారితీస్తుందని చెబుతున్నారు. బీపీ అదుపులో ఉంటుంది.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.