Summer Beers: ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 9 గంటలకే అడుగు బయటపెట్టాలంటే కష్టంగా మారుతుంది. ఓ వైపు వేడి.. మరో వైపు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చల్లదనం కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. కూలర్లు, ఏసీల కింద ఉంటూ కాలాన్ని గడుపుతున్నారు. అయితే చాలా మంది వేసవిలో చల్లటి నీటిని తీసుకోవడానికి ఇష్టపడుతారు. ఇదే సమయంలో మద్యం ప్రియులు చల్లగా ఉండే బీర్లు తాగేందుకు లైక్ చేస్తారు. మిగతా కాలాల్లో కంటే వేసవిలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ వైన్ తీసుకునేవారు సైతం వేసవిలో బీర్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే బీర్లు తాగేటడపుడు కొన్ని తినకూడని ఆహార పదార్థాలు తీసుకుంటారు. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు.
వేసవిలో బీర్లు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని భావిస్తారు. కానీ బీర్లు తాగడం వల్ల అప్పటి వరకు చల్లటి పానీయం శరీరంలోకి పోతుంది. మరోవైపు కిక్ ఇవ్వడంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. కానీ బీర్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల బాడీ చల్లబడదు. డీ హైడ్రేషన్ కు గురవుతుందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసవి ఉపశమనం కోసం ఒకటి, రెండు బీర్లు పర్వాలేదు. కానీ అదేపనిగా బీర్లు తాగడం వల్ల ఇవి విషంగా కూడా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఆల్కహాల్ ఏదైనా తీసుకునేటప్పుడు దానికి సరైన ఆహారం ఉండాలి. తక్కవు ఆల్కహాల్ తీసుకొని ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని చేకూరదు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలని అనే విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటారు. కొందరు మైకం ఎక్కువ కావడానికి అసలు ఆహారాన్నే తీసుకోరు. మరికొందరు మాత్రం మాంసం ఉండేలా చూసుకుంటారు. కానీ వేసవి కాలంలో బీర్లతో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి. ముఖ్యంగా ఈ కిందివి తీసుకోవడం వల్ల మరీ ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని అంటున్నారు.
బీర్లు తాగేటప్పుడు ముఖ్యంగా బర్గర్ల జోలికి అస్సలు పోకూడదు. ఫ్రెంచ్ ప్రైస్ లాంటి పుడ్స్ వైపు చూడొద్దు. ఎందుకంటే వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తుంది. సాధారణంగా డార్క్ చాక్లెట్లు తీసుకోవడం ఎనర్జీనే. అందుకని కొందరు బీర్లు తాగేటప్పుడు వీటిని తీసుకోవాలనుకుంటారు. అయితే ఈ సమయంలో డార్క్ చాక్లెట్లు తీసుకుంటే అనారోగ్యపాలవుతారు.
ఇక బీర్లు తాగేటప్పుడు ఎగ్ తీసుకుంటారు. ఇది కూడా జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిని కలిగిస్తాయి. గ్రుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఫలితంగా తరువాత మీరు భోజనం చేస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. బీర్లు తాగే సమయంలో కొందరు బ్రెడ్ ను కూడా తీసుకుంటారు. బ్రెడ్ తీసుకోవడం వల్ల ప్రేగు సమస్యలు వస్తాయి. అందువల్ల వేసవిలో బీర్లు తాగేటప్పుడు లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.