Dyeing Your Hair: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాతావరణ కలుషితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో జుట్టు తెల్లబడడం కూడా జరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది జుట్టు తెల్లగా మారుతుంది. శరీరంలో డి3, బి 12 విటమిన్ ల తో పాటు ఐరన్ లోపంతో ఈ సమస్య ఎదురవుతుంది. అయితే చిన్న వయసులో ఉన్నవారు తెల్ల జుట్టు కనిపించగానే ఆందోళన పడిపోతారు. వెంటనే దానిని దాచేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రంగులు వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే తప్పనిసరి అన్నప్పుడు రంగులు వేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడమే మంచిది. ఆ జాగ్రత్తలేవు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చినవారు ఆముదం, నువ్వుల నూనె వంటివి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ జుట్టుకు రంగు వేసుకుంటున్నారు. పబ్లిక్ లో ఎక్కువగా ఉండేవారు అందంగా కనిపించడం కోసం జుట్టుకు రంగు వేసుకోవడం తప్పనిసరి. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. రంగు వేసుకోగానే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినవారు.. వీటికి దూరంగా ఉండడమే మంచిది. అయితే ప్రత్యామ్నాయంగా జుట్టు నల్లగా ఉండడానికి ఇలా చేయాలి.
కొన్ని రకాల రంగులు వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే నాణ్యమైన రంగును వేసుకుంటే ఈ సమస్య ఉండకపోవచ్చు. కానీ కొంతమంది ఎక్కువ ధర అని వీటికి దూరంగా ఉంటారు. ఒకసారి రంగు వేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రంగు వేసుకున్న తర్వాత కొన్ని రోజులపాటు వేడి నీళ్లతో తల స్నానం చేయకుండా ఉండాలి. సూర్య రశ్మి నుంచి కాపాడుకునేందుకు టోపీ లేదా ఇతర వస్తువులను ఉపయోగించాలి. రంగు వేసుకున్న మరుసటి రోజు ఆయిల్ ను అప్లై చేయడం ద్వారా రంగు ఎక్కువ రోజులు నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. రంగు వేసుకున్న తర్వాత ఎక్కువసార్లు షాంపుతో స్నానం చేసినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది.
ఇలా పాటించిన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు వస్తే రంగు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలామందికి తెల్ల జుట్టు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ తెల్ల జుట్టును ఫ్యాషన్ గా కూడా మార్చుకోవచ్చు. కొందరు సినీ సెలబ్రిటీలు తెల్ల జుట్టును ఫ్యాషన్ గా మార్చుకొని ట్రెండీగా ఉంటున్నారు. తమిళ హీరో అజిత్.. తెలుగు హీరో జగపతిబాబు తెల్ల జుట్టుతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఇలా తెల్ల జుట్టుతోనే కనిపించినా.. పెద్ద సమస్య ఉండదు.
అయితే పెళ్లి కావాల్సిన వారు.. యువకులు మాత్రం ఆరోగ్య నిపుణులు సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. రసాయనాల వల్ల సమస్యలు వస్తున్నాయని అనిపిస్తే.. ప్రత్యేకంగా మెడిసిన్ వాడాలి. కొన్ని సాంప్రదాయ పద్ధతులు కూడా తెల్ల జుట్టును నివారించే అవకాశం ఉంటుంది. వీటి గురించి తెలుసుకొని అవి పాటిస్తే మంచిది.