Disposable Paper Cups: ఆ కప్పుల్లో టీ తాగుతున్నారా.. మీ గుండె డెంజర్‌లో పడ్డట్లే!

పేపర్‌ కప్పు అనగానే పూర్తిగా పూపర్‌తో తయారు చేస్తామని భావిస్తాం. కానీ, ఇది పూర్తిగా పేపర్‌తో తయారు కాదు. పేపర్‌తో తయారు చేస్తే అది వేడి టీ పోస్తే అలాగే నిలబడి ఉండదు. అలా నిలబడి ఉండడానికి కారణం అందులో కూడా ప్లాస్టిక్‌ లేయర్‌ ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 4:34 pm

Disposable Paper Cups

Follow us on

Disposable Paper Cups: ఏ చాయ్‌ చటుక్కునా తాగరాభాయ్‌.. అంటూ చాలా మంది టీ లవర్స్‌ రోజుకు నాలుగైదుసార్లు టీ లాగించేస్తుంటారు. ఉదయం, సాయంత్రం ఇంట్లో తాగే టీలతోపాటు వీలు దొరికినా, ఫ్రెండ్స్‌ కలిసినా.. మీటింగ్‌కు వెళ్లినా.. బయట టీ తాగుతుంటారు. కొంతమంది కాఫీ, పాలు తాగుతారు. అయితే బయట ఈమధ్య చాలా మంది పేపర్‌ కప్స్‌వాడుతున్నారు. హోళ్ల యజమానులు గాజు గ్లాసులు, పింగాణీ కప్పులను సరిగా శుభ్రం చేయకపోవడం ఇందుకు ఒక కారణమైతే.. కరోనా తర్వాత ఈ జాగ్రత్తలు మరింత పెరిగాయి. దీంతో ఎప్పుడు టీ తాగినా పేపర్‌ కప్‌లో పోయమని అడిగి మరీ తాగుతున్నాం. కానీ, పేపర్‌ కప్పుల్లో టీ తాగడం చాలా డేంజర్‌ అంటున్నారు నిపుణులు, పరిశోధకులు. అదెలానో తెలుసుకుందాం.

పేపర్‌ కప్‌లో ప్లాస్టిక్‌..
పేపర్‌ కప్పు అనగానే పూర్తిగా పూపర్‌తో తయారు చేస్తామని భావిస్తాం. కానీ, ఇది పూర్తిగా పేపర్‌తో తయారు కాదు. పేపర్‌తో తయారు చేస్తే అది వేడి టీ పోస్తే అలాగే నిలబడి ఉండదు. అలా నిలబడి ఉండడానికి కారణం అందులో కూడా ప్లాస్టిక్‌ లేయర్‌ ఉంటుంది.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పరిశోధన..
తాజాగా పేపర్‌ కప్పుల వినియోగంపై ఐఐటీ ఖరగ్‌పూర్‌ వారు ఇటీవల పరిశోధన చేశారు. ఇలాంటి కప్స్‌లో వేడివేడి టీ, కాఫీ, పాలు పోసిన 15 నిమిషాల తర్వాత 25 వేల మైక్రాన్‌ సైజు పార్టికల్స్‌ టీ లేదా కాఫీలో కలుస్తున్నట్లు గుర్తించారు. అయాన్స్, టాక్సిక్‌ హెవీ మెటల్స్‌ ఇందులో కలిసిపోతాయి.

ఏం జరుగుతుందో తెలుసా..
ఇలాంటి ప్లాస్టిక్‌ మిక్స్‌ అయి ఉన్న పేపర్‌ కప్స్‌లో టీ తాగడం వలన మనకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. బీపీ రావడానికి అవకాశాలు పెరుగుతాయట. గుండెపోటు గురయ్యేవారిలో చాలా మందికి ఈ కారణం కూడా ఒకటని ఖరగ్‌పూర్‌ పరిశోధకులు తేల్చారు.

మరి మీరు ఇలాంటి కప్పుల్లో టీ, కాఫీ, పాలు తాగడం ఇప్పటి నుంచే మానేయడం చాలా మంచిది.