Milk: పాలలో చక్కెర వేసుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..

పాల రుచి పెంచడానికి కొందరు చాక్లెట్ సిరప్‌ కలుపుకుంటారు. అయితే పాలల్లో చాక్లెట్ సిరప్ కలిపి తాగడం వలన శరీరంలో రిఫైన్‌ చేయని కొవ్వులు పెరుగుతాయి.

Written By: Raj Shekar, Updated On : March 9, 2024 8:56 am

Milk

Follow us on

Milk: పాలు ఆరోగ్యానికి మంచిది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రిజర్వుడు పాలతో ఆరోగ్యం సంగతి దేవుడెరుగు… కొత్తకొత్త వ్యాధులు మోపవుతున్నాయి. ఇక తాగే పాలు రుచిగా ఉండడానికి అందులో చక్కెర, బెల్లం, తేనె వంటికి కలుపుతాం. కొందరు వివిధ రకాల పొడులు కలుపుతారు. పాలల్లో మనం కలుపుకునే చక్కెరతో మరింత ముప్పుగా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెరతోపాటు నాలుగు రకాల పదార్థాలు కొలుపొద్దని సూచిస్తున్నారు.

చక్కెర..
పాలు తాగే చాలా మంది అందులో చక్కెర కలుపుకుంటారు. పిల్లలకు కూడా పాలల్లో పంచదార కలిపి తాగిస్తారు. అయితే పాలల్లో పంచదార కలిపితే క్యాలరీలు మరింత పెరుతాయట. పాలల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దానికి చక్కెర కపడం వలన క్యాలరీలు మరింత పెరిగి బరువు పెరుగుతారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీంతో పంచదార కలిపి తాగుతారు, తాగిస్తారు. ఇలా తాగితే షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయట. పాలు, పంచదార కలయిక జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయట. ఎసిడిటీ, మలబద్ధకం, డయేరియా, పైల్స్‌ వంటి సమస్యలకు దారి తీస్తుందట.

చాక్లెట్ సిరప్
పాల రుచి పెంచడానికి కొందరు చాక్లెట్ సిరప్‌ కలుపుకుంటారు. అయితే పాలల్లో చాక్లెట్ సిరప్ కలిపి తాగడం వలన శరీరంలో రిఫైన్‌ చేయని కొవ్వులు పెరుగుతాయి. ఇది కూడా బరువు పెరగడానికి, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతుంది. పలురకాల సమస్యలకు కారణమవుతుంది.

కెఫిన్
చాలామంది పాలతో టీ లేదా కాఫీ తాగుతారు. అది కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెఫిన్‌ పాలలో కలిపితే పాలలో పోషకాలు శరీరానికి అందకుండా చేస్తుంది. కెఫిన్‌ కారణంగా నిద్ర లేమి, హార్ట్‌ బీట్‌ పెరగడం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కృత్రిమ స్వీటెనర్లు..
ఇక పాలలో తీపి పెరగడానికి కొందరు కృత్రిమ స్వీటెనర్లు వాడతారు. కానీ, ఇవి చక్కెరకన్నా ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కృత్రిమ స్వీటెనర్ల కలపడం వలన వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కొవ్వులు పెరుగుతాయి. అజీర్ణ సమస్య వచ్చే అవకాశం ఉంది.