Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi Capital :  అమరావతి నిర్మాణం పెద్ద టాస్క్.. చంద్రబాబు ఏం చేయనున్నారు?

Amaravathi Capital :  అమరావతి నిర్మాణం పెద్ద టాస్క్.. చంద్రబాబు ఏం చేయనున్నారు?

Amaravathi Capital :  టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చింది. గత ఐదేళ్లలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి వైసిపి నిర్లక్ష్యం చేసింది.కొందరు మంత్రులు అయితే అమరావతిని స్మశానంతో పోల్చారు. అమరావతి రైతుల త్యాగాలను అపహాస్యం చేశారు.వారిపై దారుణంగా వ్యవహరించారు. దాడులతో పాటు కేసులకు తెగబడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో కూటమి విజయంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.వారి ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు అమరావతికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తోంది.బడ్జెట్లో 15000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇంకోవైపు అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో వైసిపి భిన్న ప్రచారానికి తెరలేపింది.2014 నుంచి 2019 మధ్య అమరావతిని గ్రాఫిక్స్ గా చూపినట్లు ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా దానినే హైలెట్ చేస్తోంది వైసిపి.అమరావతికి నీటి గండం ఉందని ప్రచారం చేస్తోంది. నీటిలో మునిగిన నిర్మాణాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది వైసిపి. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు సర్కార్ స్పందించకపోతే గతం మాదిరిగా ప్రజల్లో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.

* తొలుత జంగిల్ క్లియరెన్స్
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణాలను యధాస్థితికి తెచ్చి పనులు ప్రారంభించాలని సర్కార్ భావించింది. మొన్నటికి మొన్న సిఆర్డిఏ భవన నిర్మాణ పనులను పున ప్రారంభించడంతో.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాజధాని అమరావతి లోని భవన నిర్మాణాల పట్టిష్టతకు ఎలాంటి డోకా లేదని ఐఐటీల నిపుణులు స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో.. అమరావతి ఒక చిట్టడవిలా మారిపోయింది. ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో వరద నీరు చేరి.. అందులో నిర్మాణాలు నానిపోయాయి. ఈ నేపథ్యంలో చెన్నై, హైదరాబాద్ కు చెందిన ఐఐటి నిపుణులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు.ఆ నిర్మాణాలను పరిశీలించారు. అయితే ఆ భవనాలతో పాటు నిర్మాణాలు బాగానే ఉన్నాయని.. తదుపరి నిర్మాణ పనులు చేపట్టవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.దీంతో చంద్రబాబు సర్కార్ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది.

* అదే పనిగా విషప్రచారం
అయితే అదే పనిగా వైసిపి అమరావతి పై విషం కక్కుతోంది. అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తోంది.ముఖ్యంగా సచివాలయ నిర్మాణం విషయంలో విష ప్రచారానికి దిగింది. వాస్తవానికి అక్కడ 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తున్నారు. పూర్తి రాఫ్టు ఫౌండేషన్ టెక్నాలజీ తో నిర్మించారు. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యం చేసినా కాంక్రీట్ లో కానీ.. ఐరన్ లో కానీ ఎక్కడ లోపాలు లేవని నిపుణులు పేర్కొన్నారు. అనుమానాలను తెరదించుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు భవనానికి సంబంధించి ఐఐటి నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎందుకో అదే పనిగా వైసిపి ప్రచారం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి నిర్మాణాల పనులను పునః ప్రారంభించడంతో తట్టుకోలేక ఎటువంటి ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టాలని.. ప్రచారానికి చెక్ చెబుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని కూటమి పార్టీల శ్రేణులు కోరుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular