Shani Dev
Shani Dev: మనం ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగకపోతే వారికి శని ఉందని అంటారు. దీంతో జీవితం మీదే విరక్తి కలుగుతుంది. చివరకు ఆత్మహత్యల వరకు వెళ్లిన వారున్నారు. శని బాగా లేకపోతే పరిహారాలు చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలి కానీ విరక్తి మంచిది కాదు. శని మీదే భారం వేసి పనులు చేసుకుంటుంటాం. శని దేవుడి కోపం ఉంటే మనకు ఏదీ సాధ్యం కాదు.
శనిదేవుడి వక్ర దృష్టి ఉంటే ఏ పనులు ముందుకు సాగవు. ఇప్పుడు శనిదేవుడి స్థానం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. శని ప్రభావం వల్ల మూడు రాశుల వారికి వ్యతిరేక ప్రభావాలు వస్తాయి. దీంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
వృశ్చిక రాశి వారికి శని నాలుగో ఇంట అస్తమించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి ఆనందం కలుగుతుంది. తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాపారస్తులకు నష్ట సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు.
కర్కాటక రాశి వారికి శని దేవుడు చికాకులు కలిగించనున్నాడు. శని ఎనిమిదో ఇంట సెట్ కావడం వల్ల నష్టాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కుంగిపోయే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి శని దేవుడి వల్ల కష్టాలు వస్తున్నాయి. ఏడో ఇంట్లో శని అస్తమించనున్నాు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. డబ్బు వృథాగా ఖర్చు చేయకూడదు. బడ్జెట్ కు అనుకూలంగా మసలుకోవాలి.