Modi – Chandrababu : చంద్రబాబుకు షాకిచ్చిన మోడీ.. నమ్మరుగాక నమ్మరు

బీజేపీ వ్యూహాత్మకంగా పిలవలేదా? లేకుంటే మరే ఇతర కారణాలున్నాయో తెలియదు కానీ.. టీడీపీ శ్రేణుల్లో ఓకింత ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకత్వం ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది.

Written By: Dharma, Updated On : July 19, 2023 9:11 pm
Follow us on

Modi – Chandrababu : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి దేశ వ్యాప్తంగా 38 పార్టీలు హాజరయ్యాయి. అటు విపక్ష కూటమి సమావేశానికి 26 పార్టీలు పాలుపంచుకున్నాయి. అయితే పార్టీల బలబలాలను చూసుకుంటే మాత్రం విపక్షకూటమి స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఎన్డీఏలో మాత్రం బీజేపీ బలమైన పార్టీగా ఉండగా.. మిగతావన్నీ చిన్నాచితకా పార్టీలే. కానీ ఈ పార్టీలనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశాలకు పిలవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్డీఏలో పనిచేసిన టీడీపీ, శిరోమణి అకాలిదళ్, జేడీఎస్ వంటి పార్టీలను పిలవకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. తొలుత ఆహ్వాన జాబితాలో ఈ మూడు పార్టీల పేర్లు ఉన్నా.. బీజేపీ ఎందుకో పక్కన పెట్టింది.

బీజేపీ వ్యూహాత్మకంగా పిలవలేదా? లేకుంటే మరే ఇతర కారణాలున్నాయో తెలియదు కానీ.. టీడీపీ శ్రేణుల్లో ఓకింత ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకత్వం ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది. అయితే చివరి వరకూ ఆహ్వానం అందుతుందని టీడీపీ భావించింది. జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులతోనైనా ఆహ్వానిస్తుందని నమ్మకం పెట్టుకుంది. 26 రాజకీయ పార్టీలతో విపక్ష కూటమి స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.

చంద్రబాబు ఆ కూటమి వైపు వెళ్లిపోతారన్న భయంతోనైనా పిలవాలి. కానీ పవన్ రూపంలో దానికి బీజేపీ అడ్డుకట్ట వేయగలిగింది. తాను విపక్ష కూటమి వైపు వెళితే ఆ మరుక్షణం జగన్ ఎన్డీఏలోకి ఎంట్రీ సుగమం అవుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే చంద్రబాబును దిగ్బంధించి పవన్ ను మాత్రమే బీజేపీ ఆహ్వానించింది. ఇక్కడ వైసీపీ, టీడీపీకి బీజేపీ సమదూరం పాటించినట్టయ్యింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏ పార్టీతో కలిస్తే మేలో చివర్లో ఆ పని చేద్దామని.. అంతవరకూ జనసేనతో మాత్రమే స్నేహం కొనసాగిస్తామన్న స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఒక్క పవన్ కే స్నేహ హస్తం అందించింది.

అయితే పవన్ జాతీయ మీడియాతో చేసిన కామెంట్స్ చంద్రబాబుకు ఊరడింపునిచ్చాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే వెళతాయని చేసిన ప్రకటనతో రిలీఫ్ లభించింది. అలాగే తనతో పాటు ఒకప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పిన శిరోమణి అకాలిదళ్, జేడీఎస్ వంటి పార్టీలకు సైతం తాత్కాలికంగా దూరం పెట్టడంతో ఏదో వ్యూహం దాగి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో ఎన్డీఏలోకి ఈ పార్టీలను ఆహ్వానించక అనివార్య పరిస్థితి బీజేపీదని టీడీపీ బాస్ ఒక అంచనాకు వచ్చారు.