KCR: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తారన్నది ఎవరికి తెలియదు. ఆయన చర్యలు అనూహ్యం అంటారు. తాజాగా తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ చేసిన కేసీఆర్.. పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు ఖచ్చితంగా పదవులు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో విలన్ కాకుండా ఎలా వ్యవహరించాలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్(KCR) హితబోధ చేసినట్టు తెలిసింది. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో చేతులెత్తేసిందన్న కేసీఆర్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతుబంధు వేదిక దగ్గర చర్చలు నిర్వహించి మరీ రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని.. ప్రత్యామ్మాయ పంటలకు సంబంధించి అవగాహన కల్పించాలని నేతలను కోరారట.. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని సూచించారు.
ఇక తెలంగాణలో రైతుబంధు, దళితబంధుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు యథావిధిగా ఇస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
Also Read: బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్కా ప్లాన్?
చురుకుగా అందరూ పనిచేయాలని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించే బాధ్యత తనది అంటూ కేసీఆర్ నేతలకు భరోసానిచ్చారు. నాయకులకు ఓపిక ఉండాలని.. పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు ఖచ్చితంగా పదవులు వస్తాయని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని అన్నారు.
హుజూరాబాద్ లో ఓటమి తర్వాత దళితబంధు ఆగుతుందని సాగుతున్న ప్రచారానికి కేసీఆర్ తెరదించారు. ప్రతి నియోజకవర్గంలో మొదట 100మందికి ఈ పథకం వర్తిస్తామని .. తర్వాత దశలవారీగా అందరికీ అమలు చేస్తామని వెల్లడించారు. దీంతో సమస్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా వ్యవహరించాలో మొత్తానికి కేసీఆర్ స్పష్టతనిచ్చారు.
Also Read: బీజేపీకి భారీ షాక్.. ఈటల వ్యూహానికి చెక్ పెట్టిన కేసీఆర్.. ఎలాగంటే?