Hanuman Pooja: హనుమాన్ జయంతి ఈనెల 16న రానుంది. దీని కోసం ఇప్పటినుంచే భక్తులు ఎదురు చూస్తున్నారు. హనుమాన్ జయంతి రోజు ఆయనను కొలిస్తే అన్ని కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ రోజు దేవాలయాలు కిటకిటలాడతాయి. భక్తులతో నిండిపోతాయి. హనుమాన్ భక్తులతో గుళ్లు సందడిగా మారుతాయి. ఈ రోజు ఆంజనేయుడిని పూజించడంతో ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం జయంతి శనివారం రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

హనుమాన్ జయంతి రోజు పొద్దున్నే గుడికి వెళ్లి దేవుడిని కొలుస్తారు. దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్థిస్తారు. దీపారాధనతో వాయుపుత్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు. అందుకే భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు స్నానాలాచరించి శుభ్రంగా వెళ్లి దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. హనుమాన్ దయ మనపై ఉండాలంటే హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించాలి.
Also Read: RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !
శనిదోశం పూర్తిగా తొలగేందుకు హనుమాన్ ను కొలవడం తెలిసిందే. స్వామివారికి 11 రావి ఆకులపై రామనామం రాసి దేవుడి ముందుంచాలి. తమలపాకులు సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఆవనూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు ఉంచి పూజించాలి. దీంతో హనుమాన్ పూజకు భక్తులు తాపత్రయపడుతుంటారు. దీనికి గాను హనుమాన్ జయంతిని ఉపయోగించుకుని తమ దోషాలు తొలగించుకోవాలని చూస్తున్నారు.

ఆవునెయ్యితో చేసిన ఐదు రొట్టెలను నైవేద్యంగా సమర్పిస్తే స్వామి వారి కృప మనమీద ఉంటుందని చెబుతారు. జయంతి రోజు కొబ్బరికాయ తలపై పెట్టుకుని ఏడు సార్లు తాకించాలి. తరువాత గుడిలో కొట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. దీంతో హనుమాన్ కోసం భక్తులు అన్ని మార్గాల్లో కొలిచేందుకు సిద్ధపడుతున్నారు.
Also Read:Telangana BJP: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?