Amazon Prime Lite: ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మనమంతా అమెజాన్ ప్రైమ్ కు అలవాటు పడిన తర్వాత.. ఆ సంస్థ సబ్ స్క్రిప్షన్ ఫీజును పెంచడం మొదలుపెట్టింది. ఇప్పుడు అది ఏకంగా 1499 అయి కూర్చుంది. ఇక నెలవారి అయితే 299 దాకా చెల్లించాల్సి వస్తోంది. అయితే దీనివల్ల చాలామంది అమెజాన్ నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఆమెజాన్ ది.. ఇలాంటి క్రమంలో పోటీ సంస్థల నుంచి కాపాడుకునేందుకు, సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు అమెజాన్ ఎత్తుగడ వేసింది. ” లైట్” పేరుతో సరికొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. ఇది తన సబ్స్క్రైబర్ బేస్ ను విస్తరించడానికి ఉపయోగపడుతుందని అమెజాన్ కంపెనీ చెబుతోంది.
ఒకే వార్షిక ప్లాన్
ప్రైమ్ లైట్ సబ్స్క్రైబ్ సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ పలే కాకుండా ఒకే వార్షిక ప్లాన్ కలిగి ఉంటుంది. త్రైమాసిక లేదా నెలవారి ప్లాన్లు లేనందువల్ల వినియోగదారులు 12 నెలలకు 999 రూపాయలు చెల్లించాలి. సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ తో పోలిస్తే ఈ ధర చాలా తక్కువ. దానికి, దీనికి 500 దాకా తేడా ఉంది. రెగ్యులర్ ప్రైమ్ నెలవారి సభ్యత్వానికి సంబంధించి అమెజాన్ 299 రూపాయలు వసూలు చేస్తోంది. త్రైమాసిక సభ్యత్వానికి 599 రూపాయల దాకా వసూలు చేస్తోంది.
ఇవీ తేడాలు
ప్రయోజనాలపరంగా చూస్తే ప్రైమ్ లైట్, అమెజాన్ ప్రైమ్ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ప్రైమ్ లైట్ మెంబర్లు ఒకరోజు లేదా రెండు రోజుల డెలివరీ ఆస్వాదించొచ్చు. అర్హత గల చిరునామాలకు ఎటువంటి హడావిడి షిప్పింగ్ చేయలేరు. అమెజాన్ ఉచిత స్టాండర్డ్ డెలివరీకి కనీస ఆర్డర్ విలువ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక రెగ్యులర్ ప్రైమ్ అమెజాన్ మ్యూజిక్, వీడియోలకు యాక్సెస్ ఇస్తుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ లో నాణ్యత ఒక కేటగిరి వరకే పరిమితమవుతుంది. ఇక ప్రైమ్ లైట్ సభ్యులకు కూడా అవే ప్రయోజనాలు అవుతాయి. వినియోగదారులు హై డెఫినిషన్ నాణ్యతతో రెండు పరికరాలలో అపరిమిత వీడియో స్ట్రీమింగ్ ఆస్వాదించవచ్చు. అయితే, సాధారణ ప్రైమ్ నెంబర్లు ఏకకాలంలో ఆరు పరికరాలలో 4కె స్ట్రీమింగ్ ఎంపికను పొందేందుకు అవకాశం ఉంది. అయితే ప్రైమ్ వీడియోలో అమెజాన్ వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయనుంది. ఈ వాణిజ్య ప్రకటనలు ఏ రూపంలో ఉండబోతున్నాయి అనే విషయాన్ని మాత్రం అమెజాన్ స్పష్టం చేయలేదు. సాధారణ సభ్యత్వంతో కూడిన ప్రైమ్ వీడియోలు సోలు లేదా చలనచిత్ర ప్రారంభంలో కూడా ప్రకటనలు ప్రదర్షితమవుతాయి. వాటిని దాటవేసేందుకు స్కిప్ అనే ఒక బటన్ ఉంటుంది. మరి అమెజాన్ ఆ అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుందో లేదో చెప్పలేదు.
రకరకాల ప్రయోగాలు
ఇక అమెజాన్ తో పాటు నెట్ ప్లిక్స్ కూడా తన సబ్స్క్రైబర్ బేస్ పెంచుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఎంపిక చేసిన దేశాలలో, వినియోగదారులు తమ సొంత సభ్యత్వాలను పొందే లాగా బలవంతంగా ఖాతా షేరింగ్ అణిచివేస్తోంది. పాస్వర్డ్ లేదా ఖాతా షేరింగ్ పై అణచివేత భారతదేశంలో ఇంకా జరగలేదు. ఎందుకంటే భారత్ ఏ సర్వీస్ ప్రొవైడర్ కైనా కీలకమైన మార్కెట్. మరోవైపు నెట్ ఫ్లిక్స్ మరింతమంది వినియోగదారులను ఆకర్షించుకునేందుకు యాడ్_ సపోర్టెడ్ స్ట్రీమింగ్ ప్లాన్ తో కూడా ప్రయోగాలు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ మాదిరిగా కాకుండా, అమెజాన్ ప్రైమ్ చాలా బహుముఖంగా, ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్ తో, వినియోగదారులు అనేక ఫీచర్లకు యాక్సెస్ ను అన్ లాక్ చేయవచ్చు. ప్రైమ్ లైట్ కూడా నెట్ ఫ్లిక్స్ కంటే చాలా బహుముఖంగా ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ వీడియో కేటలాగ్ మరింత విస్తృతంగా ఉంటుంది.