
Summer Skin Care : ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప మనుషులెవరూ బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే బయటకు వెళ్లాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డీ హైడ్రేషన్ కాకుండా తగినంత వాటర్ తీసుకుంటున్నారు. మరికొందరు వెంట బాటిల్ తీసుకెళ్తున్నారు.
ఇలాంటి సమయంలో చర్మం పాడవకుండానూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్లడం వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. ఎండవేడికి తట్టుకోకుండా నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఎండ వేడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి చాలా మంది సన్ స్క్రీన్ టాన్ చేస్తుంటారు. కానీ ఏదీ పడితే అది వాడకుండా జాగ్రత్తలు పాటిస్తూ యూజ్ చేయలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మండు వేసవిలో సూర్యుని నుంచి అతి నీలలోహిత కిరణాలు వెలువడుతాయి. దీంతో చర్మం కాంతిని కోల్పోతుంది. యూవీఏ, యూవీబి లు చర్మానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఎండలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ ను వాడడం మంచిదే. తీవ్రమైన ఎండ ఉన్నప్పుడే కాకుండా వేసవిలో ప్రతి రోజూ అప్లై చేయాలంటున్నారు. ఇలా వాడడం వల్ల అతినీలలోహిత కిరణాల నుంచి తప్పించుకోవచ్చు.
సన్ స్క్రీన్ టాన్ చేయడం వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా స్వేదం ఎక్కువగా విసర్జించేవాళ్లకి సన్ స్క్రీన్ తో మరింత ఎక్కువగా వస్తుందని చెబుతుంటారు. ఇలాంటప్పుడు వీరు నార్మల్ వి కాకుండా బ్రాండెట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచింది. లైట్ ఆయిల్, ఫ్రీ సన్ స్క్రీన్ ను కలిగిన వాటిని ఎంచుకోవడం బెటర్. అంతేకాకుండా మీరు కొనుగోలు చేసే బ్రాండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
సన్ స్క్రీన్ కరనీసం SPF 50 ఉన్నవాటినే కొనుగోలు చేయాలి. ఇవి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. దీనిని వాడిన తరువాత వాటి SPF 20 నుంచి 30 వరకు పడిపోతుంది. దీంతో మీ చర్మానికి అప్పటి వరకు రక్షణగా ఉంటుంది. సన్ స్క్రీన్ ను వాడే ముందు చర్మాన్ని ముందుగా వాష్ చేసుకోవాలి. ఆ తరువాత చర్మం కనిపించే ప్రతీ చోటా అప్లై చేయాలి. చాతీ భాగంలో డ్రెస్ ఉన్న వరకూ వేసుకోవడంతో రక్షణగా ఉంటుంది.