
Dairy Milk 90s Ad : “రండి తీయటి వేడుక చేసుకుందాం” “క్యాడ్ బరీ డెయిరీ మిల్క్” యాడ్ టీవీలో కనిపించినప్పుడల్లా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పే మాట ఇది.. ఒక మాటతో క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ అమ్మకాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. భారత దేశంలో నెంబర్ వన్ చాక్లెట్ బ్రాండ్ గా డెయిరీ మిల్క్ ను నిలబెట్టాయి. చాలా మంది కూడా డెయిరీ మిల్క్ ఇటీవల వచ్చిన ఉత్పత్తి అనుకుంటారు. అది ముమ్మాటికి కాదు..డెయిరీ మిల్క్ భారత దేశంలో 90 కాలంలోనే అడుగు పెట్టింది.. కానీ అప్పటికే దేశంలో న్యూట్రిన్, నెస్లే తిరుగులేని బ్రాండ్ లు గా కొనసాగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో క్యాడ్ బరీ అడుగుపెట్టింది. తన మాస్టర్ పీస్ ఉత్పత్తి అయిన డెయిరీ మిల్క్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ అప్పటికి నెస్లే, న్యూట్రిన్ తిరుగులేని బ్రాండ్ లు గా కొనసాగుతుండడంతో వాటికి పోటీ ఇవ్వలేకపోయింది.. కానీ అప్పుడే వచ్చిన ఒక ఆలోచన ఆ కంపెనీ దశ దిశ మొత్తం మార్చేసింది.
90 కాలంలో భారత్ లో క్రికెట్ కు క్రేజీ మొదలవడం ప్రారంభమైంది.. అంతకుముందే కపిల్ సేన ప
ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ సాధించడంతో క్రికెట్ మానియా మొదలైంది.. సచిన్ కూడా అప్పుడప్పుడే క్రికెట్ లో మెరుస్తున్నాడు.. దీంతో జనం ఎలాంటి యాడ్ చేస్తే విపరీతంగా అభిమానిస్తారో తెలుసుకున్న క్యాడ్బరీ… ఆ రూపంలో ఒక ప్రకటన రూపొందించింది. ఇది జనానికి బాగా నచ్చింది.. ఒక మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ 99 పరుగుల వద్ద ఉంటాడు. అతడు సెంచరీ సాధించాలని ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు కోరుకుంటారు. ఇదే సమయంలో అభిమానుల్లో ఒక అమ్మాయి చాక్లెట్ తింటూ ఉంటుంది. పైగా అతడు సెంచరీ సాధిస్తాడా లేదా అని టెన్షన్ పడుతుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్ కట్టుదిట్టంగా బంతులు వేస్తాడు. ఆ అమ్మాయి చాక్లెట్ తినడం చూస్తూ ఉన్న బ్యాట్స్ మెన్… ఆమె అందానికి ఫిదా అయిపోతాడు.. అదే ఊపులో బౌలర్ వేసిన బంతిని అమాంతం గట్టిగా కొడతాడు. అది అలా గాలిలో లేచి బౌండరీ లైన్ అవతలపడుతుంది. దీంతో మైదానంలో అభిమానులు సంబరాలు చేసుకుంటారు.. అతడు సెంచరీ సాధించడంతో చాక్లెట్ తింటూ ఉన్న అమ్మాయి మైదానంలోకి వస్తుంది. బ్యాట్స్ మెన్ ను అమాంతం పట్టుకుంటుంది. దీంతో స్టేడియంలో సంబరాలు మిన్నంటుతాయి.
ఈ యాడ్ లో చాక్లెట్ తింటూ ఉన్న అమ్మాయిగా అప్పటి ఇండియన్ మోడల్ శిమోనా రాశి నటించింది. చూపు తిప్పుకొనివని అందంతో ఈ యాడ్ కు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది.. ఆ యాడ్ కు తగ్గట్టు స్టెప్పులు వేయడం అప్పట్లో యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ యాడ్ వల్ల చాక్లెట్ అమ్మకాలు పెరిగాయి. పోటీ కంపెనీలకి క్యాడ్బరీ అంటే ఏంటో తెలిసి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి క్యాడ్బరీ ఇండియన్ మార్కెట్లో తిరుగులేని బ్రాండ్ గా అవతరించింది.. 90 ల కాలంలో క్యాడ్బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్ ను అబ్బాయిలు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇచ్చేవారు.. ఈ చాక్లెట్ అప్పట్లో అబ్బాయిలకు ఫేవరెట్ గా మారింది అంటే ఇదే కారణం..
ఈ యాడ్ జనాలకి బాగా చొచ్చుకుపోవడంతో క్యాడ్బరీ సంస్థ పలు ప్రకటనలు రూపొందించింది.. అందరికంటే ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో ” రండి తీయటి వేడుక చేసుకుందాం అంటూ” ప్రకటన రూపొందించి చాలా ఏళ్ల పాటు వివిధ మాధ్యమాలలో దానిని ప్రసారం చేసింది. బిగ్ బీ వల్ల తమ చాక్లెట్ అమ్మకాలు ఎక్కడికో వెళ్లిపోయాయని కంపెనీ ఆమధ్య ప్రకటించింది..ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ తమ తొలి ప్రకటన చిరస్థాయిగా నిలిచిపోతుందని కంపెనీ తెలిపింది.. ప్రస్తుతం సోషల్ మీడియా రోజులు కాబట్టి ఆనాటి ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. దీన్ని చూసిన ఆనాడు తరం వారు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.. కొంతమంది ఆ చాక్లెట్ యాడ్ లో నటించిన శిమోనా రాశి తమ క్రష్ అని,ఆ యాడ్ చూసిన తర్వాత నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram