
TSPSC Question papers leaked: తెలంగాణ పబ్లిక్ సర్వీసక్ కమీషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ విచారణలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. దాదాపు ఇటీవల విడుదలైన అన్ని నోటిఫికేషన్ల ప్రశ్నపత్రాలు లీకైనట్లు తెలుస్తోంది. ప్రవీణ్ వెనుక పెద్ద నెట్‌వర్కే ఉన్నట్లు తెలుస్తోంది.
అవి కూడా లీక్?
టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాల లీక్‌లో విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని అనుమానిస్తుండగా.. ఈ నెల 5 జరిగిన ఏఈ ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. తాజాగా
గ్రూప్‌వ–1 ప్రశ్నపత్రం కూడా..
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రశ్నపత్రం కూడా ప్రవీణ్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూనే ప్రవీణ్ కూడా గ్రూప్–1 పరీక్ష రాశాడు. ఆయన ఓఎంఆర్ షీట్‌కూడా తాజాగా బయటకు వచ్చింది. కనీస టాలెంట్ లేని ప్రవీణ్ గ్రూప్‌వన్ ప్రిలిమ్స్‌లో 103 మార్కులు సాధించడంపై నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సమాధానాలన్నీ బట్టీ పట్టకుని వెళ్లి పరీక్ష రాసి ఉంటాడడని అనుమానిస్తున్నాడు. దీంతో ఆ పేపర్ కూడా లీక్ చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం..
ప్రవీణ్ తండ్రి గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ఆయన మరణంతో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన ప్రవీణ్ నాలుగేళ్లుగా టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్నాడు. గతంలో వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన ఆయన అధికారుల వద్ద సౌమ్యుడిగా ఉంటూ అధికారి పీఏగా చేరినట్లు తెలుస్తోంది.

రెండు నెలల ముందే ప్రశ్న పత్రాలు..
టీఎస్‌పీఎస్సీ సాధారణంగా ఏ పరీక్షలకు సంబంధించైనా రెండు నెలల ముందుగానే నియామక పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంను సిద్ధంచేస్తుంది. ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరుస్తారు. ప్రశ్నల పక్కనే వాటి జవాబులుంటాయి. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను నిందితులు డౌన్‌లోడ్ చేశారు. ఇందులో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్‌లో జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కాపీ చేసి భద్రపరిచిన ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫోల్డర్‌లో అనేక ప్రశ్నపత్రాలు..
ప్రవీణ్ డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడటంతో.. వాటి స్థానంలో కొత్త ప్రశ్నాపత్రాలను కమిషన్ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్ బలహీనంగా ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని తెలిసింది. ప్రత్యేక సర్వర్, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో కంప్యూటర్లను నిందితులు తేలికగా హ్యాక్ చేసినట్లు తేలింది .
జనార్ధనా ఏమి నీతో ప్రయోజనం..
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనర్దాన్‌రెడ్డి ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఏ నోటిఫికేషన్ అయినా, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రం రూపకల్పన జరుగుతాయి. ప్రశ్నపత్రాల స్టోరేజీ కూడా ఆయన నియంత్రణలోనే ఉండాలి. కానీ ఆయన వీటిని పట్టించుకోవడం లేదా లేక రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీకేజీ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న రోపణలు వస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీనేతలే వెనుకుండా ఈ వ్యవహారం నడిపుస్తన్నట్లు విపక్షాలు, నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.