
TSPSC Leakage: జనార్దన్‌రెడ్డి ఐఏఎస్.. ఈయన ఎక్కడ పనిచేస్తే అక్కడ వివాదం తప్పడం లేదు. ఆయన వైఫల్యమా.. లేక యాదృశ్చికంగా జరుగుతున్నాయో తెలియదు కానీ ఆయన పనిచేసిన వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గతంలో జనార్దన్‌రెడ్డి ఇంటర్‌మీడియెట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక తెలంగాణ వ్యాప్తంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీని, ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.
‘గ్లోబరీనా’ గోల్‌మాల్
2019లో ఇంటర్‌మీడియెట్ కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం బాధ్యతను గ్లోబరీనా అనే సంస్థకు అప్పగించారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు పరీక్ష పత్రాల మూల్యాకనం బాధ్యత అప్పగించారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఈ ఘటన ఇప్పటికీ ఇటు ఇంటర్ బోర్డును, అటు తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంది. నాడు మంత్రి కేటీఆర్ ఎత్తిడితోనే గ్లోబరీనా సంస్థకు ఇంటర్ మూల్యాంకనం బాధ్యతలను అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా పదుల సంఖ్యలో విద్యార్థులు ఏజెన్సీ తప్పిదానికి బలయ్యారు.

తప్పు అంగీకరించిన జనార్దన్‌రెడ్డి..
ఇంటర్‌మీడియెట్ మూల్యాంకనంలో తప్పు దొర్లినట్లు నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. హాల్ టిక్కెట్ల జారీ దగ్గరి నుంచి ఫలితాల వెల్లడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చి వుంటే బాగుండేదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిపారు. నాడు ఇంటర్‌మీడియెట్ కార్యదర్విగా ఉన్న జనార్దన్‌రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధికారులు, ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 496 మంది విద్యార్థులకు సొంత సెంటరే పడిందని కమిటీ పేర్కొన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. 531 మంది జాగ్రఫీ స్టూడెంట్స్ మెమోలో ప్రాక్టికల్ మార్కులు కనిపించలేదని, చివరి నిమిషంలో సెంటర్ మార్పు వల్ల కొన్ని తప్పులు దొర్లాయని కమిటీ పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఫస్టియర్‌లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి, సెకండియర్‌లో ఫెయిల్ అయితే రీవెరిఫికేషన్ చేయాలని త్రిసభ్య కమిటీ సూచించిన విషయాన్ని వెల్లడించారు. సాంకేతిక సమస్యతోనే 99 మార్కులకు గాను 00 మార్కులు పడ్డాయని తెలిపారు.
తాజాగా టీఎస్‌పీఎస్సీలో..
2019లో ఇంటర్‌మీడియెట్ బోర్డు ఓ కుదుపునకు గురైంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పరిస్థితి అలాగే ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో సంస్థ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి చైర్మన్‌గా నాడు ఇంటర బోర్డు కార్యదర్శిగా ఉన్న జనార్ధన్‌రెడ్డి ఉన్నారు. తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఆయన హయాలోనే జరుగడం సంచలనంగా మారింది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ అధికారులు, మెడికల్ హెల్త్ విభాగం పరీక్ష పత్రాలు లీకైనట్లు అధికారికంగా గుర్తించారు. తాజాగా గతంలో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో నిర్వహించే ప్రశ్నపత్రాలు కూడా లీకేజీలో కీలకమైన ప్రవీణ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా మొన్న ఇంటర్ మీడియెట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం వ్యవహారాం, తాజాగా టీఎస్‌పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి హయాంలోనే జరుగడం గమనార్హం.