https://oktelugu.com/

Home Loan Turnover: అప్పు చేసి ఇల్లు కొనే వారే ఎక్కువ.. హోంలోన్స్ టర్నోవర్ అన్ని వేల కోట్లా..!

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనేది పాత సామెత.. అప్పు చేసైనా ఇల్లు కట్టుకోవాలనేది నేటి సమాజం చెబుతున్న మాట. ఎవరికైనా సొంతిల్లు ఉండాలని కల ఉండడం సహజం. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 19, 2024 / 05:03 PM IST

    Home-Loan

    Follow us on

    Home loan turnover: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనేది పాత సామెత.. అప్పు చేసైనా ఇల్లు కట్టుకోవాలనేది నేటి సమాజం చెబుతున్న మాట. ఎవరికైనా సొంతిల్లు ఉండాలని కల ఉండడం సహజం. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటారు. అంతేకాదు.. సొంతిల్లు సాధించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంటారు. ఇంటి అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు సొంతింటి కోస ఆలోచిస్తుంటారు. అయితే.. అన్ని సందర్భా్ల్లోనూ అందరికి సొంత డబ్బులతోనే ఇల్లు కొనడం సాధ్యం కాదు. అందులోనూ సామాన్య ప్రజలకు మరింత కష్టంతో కూడుకున్నది. 20 ఏళ్ల క్రితం జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసేవారు. రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతున్న సమయంలో సొంతింటి కలను సాకారం చేసుకునేవారు. ఎందుకంటే అప్పట్లో ఈ హోం లోన్స్ కానీ, ఆ పర్సనల్ లోన్స్ కానీ పెద్దగా అందుబాటులో లేవు.

    రోజురోజుకూ సాఫ్ట్‌వేర్ బూమ్ పెరుగుతుండడంతో లీన్లు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ బూమ్ రాకముందు లోన్స్ తీసుకొని ఈఎంఐలు చెల్లించాలంటే ఈ సామర్థ్యం అందరికీ ఉండేది కాదు. అంతేకాదు.. ఇష్టారీతిన ఊహించని స్థాయిలో వారు లోన్ తీసుకునే దానికి భయపడేవారు. 20 ఏళ్ల పాటు నెలనెలా జీతంలో సగానికి పైగా ఈఎంఐ చెల్లించాలా అని ఆలోచించేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. చేసేది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు.. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్న వారు సొంతింటి వైపే మొగ్గుచూపుతున్నారు. ఇల్లు, కారు కలగా పెట్టుకొని ఆ తీరుగా ముందుకు సాగుతున్నారు.

    ప్రస్తుతం ఇల్లు కొనేందుకు రెడీ అయిపోతున్న వారిలో 80శాతం మంది ప్రజలు అప్పులనే నమ్ముకుంటున్నారు. 80 శాతం ప్రాపర్టీలు బ్యాంకులు, హోంలోన్లు తీసుకుంటున్నారు. ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ కాగానే.. ఓనర్ చేతికి రాకుండానే బ్యాంకు వారి చేతికి వెళ్లిపోతున్నాయి. ఎన్ని ఏళ్లు లోన్ పెట్టుకుంటే అన్ని సంవత్సరాలు ఆ పత్రాలు వారి దగ్గరే ఉంటాయి. మొత్తం అప్పు ముట్టిన తరువాతనే ఆ పత్రాలు ఓనర్ చేతికి అందుతాయి. ఆర్థిక స్థితిమంతులు అయిన కేవలం 20 శాతం మంది మాత్రమే నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. హోంలోన్లు ఇచ్చేందుకు ఇటు బ్యాంకులు, సంస్థలు కూడా ఆరాటపడుతున్నాయి. ఇష్టారీతిన వడ్డీలకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. ఎల్ఐసీ హోం ఫైనాన్సింగ్ సంస్థ హైదరాబాద్ శివారులోని నిర్మితం అవుతున్న పలు కాలనీలకు అత్యధిక ఇళ్లకు లోన్లు ఇచ్చింది. ఇంకా ఆ ప్రాపర్టీలు అన్నీ కూడా ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ దగ్గరే ఉన్నాయి. అలా సంస్థ టర్నోవర్ కూడా వేలాది కోట్లకు చేరిపోయింది. అంతేకాదు లాభాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం హోంలోన్స్ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. వారితోనే తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. వేలకు వేల టర్నోవర్ చేస్తున్నాయి. ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్లు తప్పనిసరిగా ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితే.