Chaturmas 2023: నేటి నుంచి చతుర్మాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలాన్నే చతుర్మాస దీక్షలు అంటారు. ఈ సమయంలో ఒంటి పూట భోజనం చేయాలి. నేల మీద పడుకోవాలి. మద్యం తాగరాదు. మాంసం తినకూడదు. స్త్రీ సాంగత్యం ఉండకూడదు. ఇలా పలు జాగ్రత్తలు పాటించి చతుర్మాస దీక్ష చేపడితే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ దీక్ష తీసుకున్నారు.
మొత్తం నాలుగు నెలల కాలం చతుర్మాస దీక్ష ఉంటుంది. కానీ ఈ సంవత్సరం శ్రావణమాసం అధికం రావడంతో ఈ సారి ఐదు నెలలు ఉంటుంది. చతుర్మాసం కాస్త పంచమమాసంగా చెప్పవచ్చు. కానీ దీన్ని నాలుగు నెలలుగానే చెబుతారు. 19 ఏళ్ల తరువాత అధిక శ్రావణమాసం వచ్చింది. ఈ కాలంలో శుభకార్యాలు చేయొద్దు. దీంతో చాతుర్మాసానికి విశిష్టత ఏర్పడింది.
చాతుర్మాసంలో నియమ నిబంధనలు పాటించాలి. భగవంతుని కృప కలగాలంటే ఉపవాసాలు చేయాలి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే నేలపైనే నిద్రించాలి. ఒంటపూట భోజనం చేయాలి. మద్యం తాగరాదు. మాంసం ముట్టరాదు. ఇలా కఠోర నియమాలతో ఉంటే మనకు శుభమే కలుగుతుంది. లాభాలే వస్తాయి. కానీ వీటిని తూచ తప్పకుండా పాటించే వారైతేనే ఫలితాలు సాధ్యం అవుతాయి.
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తల స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు మనసు దేవుడిపైనే ఉంచాలి. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. ఎవరితోనే పరుష పదజాలంతో మాట్లాడకూడదు. సౌమ్యంగా మాట్లాడాలి. రాత్రి వేళల్లో ఏవైనా పండ్లు తినే పడుకోవాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటల విష్ణువు, శివుడిని పూజించాలి. ఆహారం, దుస్తులు కూడా దానం చేయడం ఉత్తమం.