Chanakya Niti: భారత గడ్డమీద ఎందరో మేధావులు పుట్టారు.. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య జరిగిన పరిష్కారం చెప్పగలిగే భగవద్గీత పుట్టినది కూడా భరత గడ్డ పైన. అలా చరిత్రలో గుర్తుండిపోదగిన వ్యక్తులలో ఒకరు ఆచార్య చాణిక్యుడు. చంద్రగుప్త మౌర్యుడిని తీర్చిదిద్ది మౌర్య వంశాన్ని నిలబెట్టిన అపర దురంధరుడు అయిన చాణిక్యుడు భావితరాల కోసం రాసినదే చాణిక్య నీతి. ఇది సరిగ్గా చదివి ,అర్థం చేసుకొని జీవితంలో ఆచరించడం తెలిసిన వారికి ఎదురు ఉండదు.
జీవితంలో మనం ఎటువంటి వ్యక్తులను నమ్మవచ్చు అనే విషయంపై చాణక్యుడు చెప్పిన నాలుగు సూత్రాలను ఈరోజు మీకోసం వివరిస్తున్నాను. ఆచార్యుడు రాసిన ఈ నీతి గ్రంధంలో కేవలం ఈ ఒక్క విషయం పైనే కాదు సకల మానవ కోటికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి సంక్షిప్తంగా వివరించబడింది. ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు తప్పనిసరిగా అతని గురించి ఎటువంటి విషయాలను పరీక్షించాలి, వారి స్వభావం ను బట్టి వారి మనస్తత్వం ఎటువంటిదో ఎలా కనిపెట్టాలి అనే విషయాలను చాణిక్యుడు ఎంతో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. వీటిని పాటించిన వారు జన్మలో ఎవరి దగ్గర మోసపోరు.
చాణిక్య నీతిలో ఐదవ అధ్యాయం లోని రెండవ శ్లోకం ఏమిటంటే…
యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిగర్షణం ఛేదంతపతదనైః తథా చతుర్భిః
పురుషం పరీక్ష్యతే త్యాగేన్ శీలేన్ గుణేన్ కర్మణా’
అంటే ఒక మనిషికి త్యాగం, పాత్ర, లక్షణం కర్మ…ఇలా నాలుగు స్వభావాలు సరియైనవైతేనే మనిషి నమ్మదగినవాడు అని చాణిక్యుడు భావం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అవకాశం ఉంటుంది కానీ.. అవతలి వారిని ముంచే వ్యక్తులో అసహనం ఉంటుంది. ఎవరైతే ప్రశాంతంగా వాస్తవాలను మాట్లాడుతారో ,సన్మార్గంలో నడవడానికి ప్రాముఖ్యత ఇస్తారు అటువంటి వారు నమ్మదగిన వారు.
ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని తీసుకురావాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తి, అవతలి వారి బాధను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, త్యాగం అనే గుణం కలిగిన వ్యక్తి నమ్మదగినవాడు. అలాగే అతను ఎటువంటి పనులు చేస్తాడు, అతని పాత్ర అంటే… క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి కూడా అతను నమ్మదగిన వాడా లేదా అనేది తెలిసిపోతుంది. అలాగే డబ్బు వ్యవహారాలలో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారు అవసరాన్ని బట్టి మారుతారా లేదా అనే విషయాన్ని సూచిస్తుంది. డబ్బు అందరికీ అవసరం…. కానీ అదే జీవితం అనుకునేవారు మాత్రం డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మరి.