Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకు నంబర్ ‘23’కు అవినాభావ సంబంధం ఉంది. గతంలో టీడీపీ అంటే ఆగస్టు సంక్షోభం గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు టీడీపీ అన్నా.. చంద్రబాబు నాయకుడు అన్నా… నంబర్ 23 గుర్తుకు వస్తుంది. ఈ నంబర్ చెబితేనే టీడీపీ నేతలు హడలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో 23 కీలక భూమిక పోషిస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చంక్రం తిప్పిన చంద్రబాబుకు ఈ 23 అస్సలు కలిసిరావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లారు. అక్కడి రాజకీయాలను చేతపట్టారు. మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే 23 అంటే మాత్రం తెలుగు తమ్ముళ్లు అమ్మబాబోయ్ అంటున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
సీఎం నుంచి అరెస్ట్ వరకు అదే 23..
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచినప్పటి నుంచి సీఐడీ అరెస్ట్ అయ్యే వరకు 23 నెంబర్ కీలక భూమిక పోషిస్తుంది. ఏపీ మొదటి సీఎంగా విజయం సాధించిన చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి ‘23 మంది’ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నారు. అప్పటి నుంచి టీడీపీలో 23 నంబర్ సంక్షోభంగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ప్లాప్ అయింది. టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. ఇక మరో విశేషం ఏమిటంటే.. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చింది కూడా 2019 మే 23న కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం జగన్ 23 నంబర్ గురించి గుర్తు చేశారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని, తన నుంచి లాక్కున్న 23 నే టీడీపీకి ఇచ్చాడని బలంగా నొక్కి చెప్పారు. ఇక ఏపీ శాసన మండలి రద్దు కూడా జనవరి 23న జరిగింది.
అమరావతి భూముల వ్యవహారంలోనూ..
ఇక అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలోనూ ఏసీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2021 మార్చి 23న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతంలో ఆగస్టు సంక్షోభంతో టీడీపీ ఇబ్బంది పడేది. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి ఎన్టీఆర్‌ను గద్దె దించారు. 1994లో ఎన్టీఆర్ మూడోసారి సీఎం అయ్యరు. అదే ఏడాది ఆగస్టులో టీడీపీలో సంక్షోభం ఏర్పడింది. చంద్రబాబు ఎన్టీఆర్‌ను గద్దె దించి తాను అధికారం చేపట్టారు.
తాజాగా అరెస్ట్..
తాజాగా చంద్రబాబు నాయకుడు అరెస్ట్ అయిన తేదీ కూడా 9–9–23 అంటే 9+9+2+3 = 23 ఇది కూడా 23 కావడం గమనార్హం. సీబీఐ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు కేటాయించిన ఖైదీ నంబర్ 7691 ఈ నంబర్ 7+6+9+1=‘23’. ఆయన మళ్లీ కోర్టుకు హాజరవ్వాలని తెలిపిన తేదీ సెప్టెంబర్ ‘23’. ఇలా 23కు చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉంది. దీనిపై ఇప్పటి వరకు న్యూమరాలజిస్ట్ లు స్పందించలేదు.