AC Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఏసీ లేనిదే క్షణం గడవదు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీల కిందే టైం గడుపుతుంటారు జనాలు. కానీ ఒక్కోసారి స్ప్లిట్ ఏసీలో నీళ్లు కారే సమస్య వస్తుంది. దీంతో ఇల్లంతా తడిచిపోతుంది. గోడలు కూడా పాడైపోతాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బాధను ఇంట్లోనే, రూపాయి ఖర్చు లేకుండా మీరే బాగు చేసుకోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి 3 సులభమైన చిట్కాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
1. ఏసీ ఫిల్టర్‌ను క్లీన్ చేయండి
ఏసీ ఎయిర్ ఫిల్టర్ దుమ్ము, ధూళితో నిండిపోతే, అది గాలిని సరిగ్గా లోపలికి లాగలేదు. దీని వల్ల ఏసీ లోపల గాలి తేమను వదలడం మొదలు పెడుతుంది, నీళ్లు కారడం స్టార్ట్ అవుతుంది.
ఎలా క్లీన్ చేయాలి?
ముందుగా ఏసీ కవర్ తీయండి. తర్వాత ఫిల్టర్‌ను మెల్లగా బయటకు తీయండి. ఫిల్టర్‌ను మంచి నీటితో కడిగి బాగా ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఫిల్టర్‌ను మళ్లీ పెట్టేయండి.
2. డ్రెయిన్ పైప్‌ను అన్‌క్లాగ్ చేయండి
ఏసీలో ఒక డ్రెయిన్ పైప్ ఉంటుంది. అది లోపల తయారైన నీటిని బయటకు పంపుతుంది. ఒకవేళ ఈ పైప్ జామ్ అయితే, నీళ్లు మళ్లీ లోపలికి వచ్చి కారడం మొదలు పెడతాయి.
ఎలా అన్‌క్లాగ్ చేయాలి?
ఏసీ వెనక వైపు చూడండి, మీకు డ్రెయిన్ పైప్ కనిపిస్తుంది. డ్రెయిన్ పైప్‌పై కొంచెం నీళ్లు పోయండి లేదా గట్టిగా గాలి ఊదండి. పైప్ నుంచి మురికి నీరు లేదా ధూళి వస్తే, పైప్ క్లీన్ అయిపోయినట్టే లెక్క.
3. ఏసీని సరైన యాంగిల్‌లో ఫిక్స్ చేయండి
కొన్నిసార్లు ఏసీని ఇన్స్టాల్ చేసేటప్పుడు సమస్య వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏసీ గోడకు స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం వంకరగా పెట్టి ఉంటారు. అలాంటప్పుడు నీళ్లు ఒక వైపుకు చేరి కారడం మొదలు పెడతాయి. కాబట్టి మీరు ఏసీ లెవెలింగ్‌ను చెక్ చేయాలి. ఏసీ ఒక వైపు ఎక్కువగా వంగి ఉంటే, దాన్ని బ్యాలెన్స్ చేయండి లేదా టెక్నీషియన్ సహాయం తీసుకోండి.
అంతేకాకుండా , ఏసీలో నీటి ట్రే నిండిపోయి ఉంటే దాన్ని ఖాళీ చేయాలి. దీని వల్ల కూడా నీటి లీకేజీని తగ్గించవచ్చు. పైన చెప్పిన పద్ధతుల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, మంచి టెక్నీషియన్‌తో ఏసీ సర్వీస్ చేయించుకోండి.