Samsung: శామ్‌సంగ్ తన కొత్త, చాలా స్లీక్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌ను మే 13న మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ఇప్పటివరకు వచ్చిన గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లన్నింటిలో కెల్లా సన్నది అని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే, కంపెనీ నేరుగా ఆపిల్ త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 17 ఎయిర్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ రెండు కంపెనీలు పలుచని ఫోన్ తామే తెస్తామని పోటీ పడుతున్నాయి. కానీ నిజంగా ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే, ఈ రెండు ఫోన్ల ఫీచర్లు, డిజైన్‌లోని తేడాలను అర్థం చేసుకోవాలి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఓ లుక్కేద్దాం.
ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ సెప్టెంబర్‌లో విడుదల కావచ్చు. లీక్ అయిన రిపోర్ట్స్ ప్రకారం.. ఇది కూడా ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో కెల్లా సన్నగా ఉండబోతోంది. X (ట్విట్టర్)లో ఆపిల్ కొత్త నమూనా మోడల్స్ ఫోటోలు షేర్ చేశారు. వాటిలో ఐఫోన్ 17 ఎయిర్ ఇతర మోడల్స్‌తో పోలిస్తే తక్కువ మందంగా ఉంది.
శామ్‌సంగ్ మే 8న తన బ్లాగ్‌లో ఇలా రాసింది.. ‘స్లీక్ నెస్ కు మించి వెళ్లడానికి రెడీగా ఉన్నారా? అప్‌డేట్‌ల కోసం ఈ పోస్ట్‌ను లైక్ చేయండి. స్లీక్ గెలాక్సీ ఎస్ సిరీస్‌ను చూడటానికి మే 13న మాతో చేరండి.’ అంటే, రాబోయే స్మార్ట్‌ఫోన్ చాలా సన్నగా ఉండబోతోందని కంపెనీ చెబుతోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ఫీచర్ల గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ వెడల్పాటి కెమెరా లెన్స్ ఉంటుంది, ఇది శామ్‌సంగ్ స్పెషల్ కెమెరా ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో రావచ్చు. ఫోన్‌లో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 3800mAh బ్యాటరీ ఉండవచ్చు.
మరోవైపు, ఐఫోన్ 17 ఎయిర్ A19 చిప్‌సెట్‌తో రావచ్చు. ఈ ఐఫోన్ చాలా పలుచని డిజైన్‌తో ఉండబోతోంది. ఈ మోడల్‌లో కేవలం eSIM మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, SIM ట్రే లేని మొదటి ఐఫోన్ ఇది అమెరికా బయట అవుతుంది. ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీక్స్ ప్రకారం ఉన్నాయి. ఈ పోటీలో ఎవరు విజేత అవుతారో తెలుసుకోవాలంటే రెండు డివైజ్‌లు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.