Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. బ్యాంక్, సిమ్ కార్డ్, ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్.. ఇలా ప్రతి చోటా దీని అవసరం ఉంది. కానీ మీ ఆధార్ నంబర్‌ను ఎవరైనా తప్పుగా ఉపయోగిస్తే, ఆ సమాచారం మీకు తెలుస్తుంది. మీరు దీన్ని ఇంట్లో కూర్చొని సులభంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్‌ను ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఏంటో చూద్దాం.
Also Read : ప్రేమ పేరుతో ప్రేయసి మోసం.. ఈ ప్రేమికుడు ఎలా బుద్ధి చెప్పాడంటే..
ఆధార్ యాక్టివిటీ హిస్టరీ
మీ ఆధార్ ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారో మీరే UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. దీన్నే ‘ఆథెంటికేషన్ హిస్టరీ’ అంటారు.
ఆథెంటికేషన్ హిస్టరీ అంటే ఏమిటి?
మీ ఆధార్ కార్డ్‌ను KYC, సిమ్ కార్డ్ కొనడం, బ్యాంక్ వెరిఫికేషన్ మొదలైన పనుల కోసం ఉపయోగించినప్పుడల్లా ఆ సమాచారం UIDAI రికార్డులలో సేవ్ అవుతుంది. ఈ రికార్డ్‌ను ఆన్‌లైన్‌లో చూడడం ద్వారా మీ ఆధార్ సరైన చోట ఉపయోగించబడిందా లేదా ఏదైనా తప్పు పని కోసం ఉపయోగించబడిందా అన్న విషయం తెలుసుకోవచ్చు.
ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీని ఎలా చెక్ చేయాలి?
* దీని కోసం ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి . https://myaadhaar.uidai.gov.in
* ‘లాగిన్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ తర్వాత OTP ఎంటర్ చేసి లాగిన్ చేయండి.
* లాగిన్ చేసిన తర్వాత, ‘ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
* మీరు గత 6 నెలల హిస్టరీని చెక్ చేసుకునేందుకు తేదీని ఎంచుకోండి.
* ఇప్పుడు స్క్రీన్‌పై ఒక లిస్ట్ వస్తుంది. అందులో మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించబడిందో ఉంటుంది.
* లిస్ట్‌లో మీరు చేయని ఎంట్రీ ఏదైనా కనిపిస్తే, వెంటనే UIDAI హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి లేదా మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించండి.
Also Read : టాటా, మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న నయా ఎలక్ట్రిక్ కార్