Acharya: ఆచార్యకు పోటీగా బరిలోకి స్టార్​ సూర్య, తాప్సీ సినిమాలు

Acharya: తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాలు ఒక్కొక్కటిగా తెరపై పోటీపడేందుకు సిద్ధమవుతాయి. అయితే, కరోనా మహమ్మారి, లాక్​డౌన్​ కారణంగా ఆన్​, ఆఫ్​ సీజన్​లతో తేడా లేకుండా.. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న సినిమాలన్నీ ఒక్కసారిగా తెరపైకి వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చిరు సోలో ఎంట్రీ పక్కాఅని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఇప్పుడు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 5, 2021 12:10 pm
Follow us on

Acharya: తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాలు ఒక్కొక్కటిగా తెరపై పోటీపడేందుకు సిద్ధమవుతాయి. అయితే, కరోనా మహమ్మారి, లాక్​డౌన్​ కారణంగా ఆన్​, ఆఫ్​ సీజన్​లతో తేడా లేకుండా.. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న సినిమాలన్నీ ఒక్కసారిగా తెరపైకి వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చిరు సోలో ఎంట్రీ పక్కాఅని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఆయనకు పోటీగా స్టార్​ హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. సూర్య తన తర్వాత సినిమాతో ఫిబ్రవరిలో బరిలోకి దగనుండగా.. బాలీవుడ్​ బ్యూటీ తాప్సీ స్పోర్ట్స్ జ్రామాతో చిరుకు పోటీగా రానున్నట్లు తెలుస్తోంది.

Acharya

సూర్య ప్రస్తుతం పాండిరాజ్​ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎతుర్కుం తునింధవన్​. నవంబరులో షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 4న తమిళ్​ వర్షన్​లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు తాప్కీ కూడా తన తర్వాత చిత్రం శభష్​ మిథు అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీజిత్​ ముఖర్జీ దర్శకత్వం వ హించిన ఈ బయోగ్రాఫికల్​ డ్రామా.. ప్రముఖ మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్​ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది.

అయితే,  ఈ  రెండు సినిమాలు తెలుగులో విడుదలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. కచ్చితంగా తెలుగులోనూ పోటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మిథాలీ రాజ్​ హైదరాబాద్​కు చెందిన వ్య్కక్తి కావడం వల్ల.. ప్రైగా క్రికెటర్​ కావడం.. మరోవైపు తాప్సీ కూడా అందరికీ సుపరిచితురాలు కావడంతో.. డబ్​ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఆచార్యతో కలిసి ఈ సినిమాలు కూడా తెలుగులో విడుదలకు రెడీ అవుతాయా..  లేక వాయిదా వేసుకుంటాయా తెలియాల్సి ఉంది. ఆచార్య సినిమాలో మెగాస్టార్​తో పాటు రామ్​చరణ్​ కూడా నటిస్తున్నారు. ఇలాంటి సినిమాకు ఎంత క్రేజ్​ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో రామ్​చరణ్​ 40 నిమిషాల పాటు కనపించనబోనున్నారు. మరోవైపు కొరటాల సినిమా కావడంతో ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.