Asia Cup 2025 Pakistan: ఆసియా కప్ లో భాగంగా ఆదివారం భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఓటమి బాధ అలా ఉంటే.. గెలిచిన తర్వాత భారత జట్టు సారథి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇది కాస్త మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ సమాజం ముందు పాకిస్తాన్ ఒంటరిదైపోయింది..
Also Read: నరేంద్ర మోదీ.. ఆయనే ఓ ఇండియన్ బ్రాండ్.. బర్త్ డే వేళ అరుదైన ఫొటోలివీ
షేక్ హ్యాండ్ వివాదంలో మ్యాచ్ రిఫరీ పై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ జట్టు డిమాండ్ చేసింది. దానిని ఐసీసీ తోసిపుచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. పాకిస్తాన్ జట్టుకు ఆడిన ఒకప్పటి ఆటగాళ్లు కూడా ఐసీసీ మీద చిందులు తొక్కడం మొదలుపెట్టారు.. భారత్ మీద విష ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆటగాళ్ల మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం.. ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే దీనిపై భారత సమయ మనం పాటించింది. ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దాన్ని కొనసాగించింది.
ఎలాగూ ఒంటరి కావడంతో పాకిస్తాన్ జట్టుకు ఎటువంటి సపోర్ట్ లేకుండా పోయింది. ఆసియా దేశాలలో క్రికెట్ ఆడే జట్ల నుంచి మద్దతు లభించకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ ఆసియా కప్ లో తదుపరి మ్యాచ్ ఆడబోదని తెలుస్తోంది. ఎందుకంటే యూఏఈ తో పాకిస్తాన్ బుధవారం తలపడాల్సి ఉంది. షేక్ హ్యాండ్ వివాదంలో ఐసిసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోదని తెలుస్తోంది. పైగా పాకిస్తాన్ ప్లేయర్లు ప్రీమ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడబోదని అర్థమవుతోంది. అయితే ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడంతో ఒకింత సందిగ్ధత కొనసాగుతోంది. మరికొద్ది గంటలు గడిస్తే గాని పాకిస్తాన్ భవితవ్యం ఏమిటో తేలుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.