Consecration Celebrations in Srivari Temple: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. ఆయన దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భర్తులు తరలి వస్తుంటారు. శ్రీనివాసుని దర్శించుకుని తరిస్తుంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా దేవుడిని దర్శించుకోవాలని తాపత్రయపడుతుంటారు. వడ్డీకాసుల వాడి కోసం భక్త జనం తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఎండాకాలంలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడం తెలిసిందే. దీంతో టీటీడీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.

ఆదివారం నుంచి ఈనెల 10వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈనెల 7న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. దీంతో ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చూస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు చోటుచేసుకోకుండా ఉండాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: KCR- Aasara Pensions: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో శుభవార్త
శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా 8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మాడ వీధుల్లో ప్రత్యేక అలంకరణలతో దేవతలను ఊరేగిస్తారు. 8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్బంగా హాజరయ్యే భక్తులకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముంది. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు గాను అధికారులను అప్రమత్తం చేసింది. శ్రీవారి ఉత్సవాలను ఎలాంటి అవరోధాలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు అన్ని దారుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. దీని కోసమే శ్రీనివాసుడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.