Small business idea 2025: ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. ఉద్యోగం అయితే ఒకరి కింద పని చేయాల్సి వస్తుంది. చాలీచాలని జీతంతో నెట్టుకు రావాల్సి వస్తుంది. వ్యాపారం అయితే సొంతంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పగలు కష్టపడితే అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించవచ్చు. అయితే వ్యాపారం ప్రారంభించడం అంటే ఆషామాషి కాదు. లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కానీ కేవలం రూ.20,000 పెట్టుబడుతూ రోజుకు రూ.5000 సంపాదించే మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఈరోజుల్లో ఫుడ్ బిజినెస్ కు బాగా డిమాండ్ ఉంది. చాలామంది ఇంట్లో వండుకోవడం మానేసి స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. వినియోగదారులు రోజురోజుకు కరిగిపోతుండడంతో ఆహార పదార్థాల దుకాణాలు వారికి అనుగుణంగా వెలుస్తున్నాయి. అయితే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం రూ. 10 నుంచి రూ.20 లక్షల అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా గదిని అద్దెకు తీసుకోవడం లేదా మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడం.. కొంతమంది వర్కర్లను నియమించుకోవడం.. ఇలా అన్ని కలిపి కనీసం రూ. 20 లక్షల వరకు పెట్టుబడులు అవసరం పడతాయి.
కానీ కేవలం రూ. 20 వేల తోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందులో రూ. 3,000 తో ఫుడ్ లైసెన్స్ ఇస్తారు. రూ.10,000తో ఫుడ్ ప్యాక్ చేయడానికి కవర్స్ విత్ స్టిక్కర్లతో కొనుగోలు చేయవచ్చు. రూ.5,000తో మెనూ తయారుచేసి అందుకు కావలసిన ఫోటోలను డిజైన్ చేసి వాట్సాప్ లో షేర్ చేయాలి. దీనిని స్విగ్గి లేదా జొమాటోలో పెట్టడం వల్ల ఆర్డర్లు వస్తుంటాయి. అయితే మిగతా రూ.2000తో ప్రమోషన్ చేసుకోవడం వల్ల మరిన్ని ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా కేవలం రూ.20,000 తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదించవచ్చు..
ప్రస్తుతం బయట ఒక బిర్యాని రూ.400 కి తక్కువగా ఎవరు విక్రయించడం లేదు. కానీ రూ.200 ఒక బిర్యాని కాస్ట్ నిర్ణయిస్తే.. ఇందులో రూ.70 వరకు మార్జిన్ ఉంటుంది. ప్రతిరోజు 100 ఆర్డర్లు టార్గెట్ పెట్టుకుంటే.. రోజుకు రూ.5,000 నుంచి రూ.7000 సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే నెలకు కనీసం రూ. లక్ష యాభై వేల వరకు సంపాదించవచ్చు. ఇలా ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారం నిర్వహించుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఆర్డర్లు వచ్చిన అందులో కచ్చితంగా లాభం ఉంటుంది. వీకెండ్ లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా కూడా మరింతగా బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది.