https://oktelugu.com/

Business Ideas: ఇంటిని చూసుకుంటూ డబ్బు సంపాదించాలనుకునే మహిళలకు ఈ వ్యాపారం బెస్ట్ ఆప్షన్..

కిచెన్ కు అధిపతి ఎవరంటే మహిళలనే చెబుతారు. మగవాళ్లు ఎంత వండినా ఆడవాళ్లు చేసిన రుచిపదార్థాలను పురుషులు చేయలేరు. అందువల్ల మంచి వంట చేయడం వారితోనే సాధ్యం. కొందరు చేసిన వంటకాలు లొట్టలేసుకొని తింటూ ఉంటారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 22, 2024 / 06:07 PM IST

    Business Ideas

    Follow us on

    Business Ideas: నేటి కాలంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో భార్యభర్తలు ఇద్దరూ సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఇద్దరూ బయటి ఉద్యోగాలు చేయడం వల్ల ఇల్లు చూసుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో కొందరు మహిళలు ఇంట్లో పనులు చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండి సంపాదించడం ఎలా? అని గూగుల్ లో తెగ సెర్ఛ్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టబడితో ఈ వ్యాపారం చేస్తే మహిళలు ఓ వైపు సంపాదిస్తూ మరోవైపు ఇంటిని చూసుకోవచ్చు. అదేం వ్యాపారమో తెలుసా?

    ఇంట్లో కిచెన్ కు అధిపతి ఎవరంటే మహిళలనే చెబుతారు. మగవాళ్లు ఎంత వండినా ఆడవాళ్లు చేసిన రుచిపదార్థాలను పురుషులు చేయలేరు. అందువల్ల మంచి వంట చేయడం వారితోనే సాధ్యం. కొందరు చేసిన వంటకాలు లొట్టలేసుకొని తింటూ ఉంటారు. మరికొందరు చేసిన వంటకాల కోసం ఎగబడి తింటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ వంటకాలు నలుగురికి పరిచయం చూసి వారికి కావాల్సిన రుచికరమైన పదార్థాలను ఇస్తూ డబ్బు సంపాదించొచ్చు. అంటే ఇంట్లో ఉండే ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చన్నమాట.

    ఒకప్పుడు ఫుడ్ బిజినెస్ అంటే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మాత్రమే. వీటిని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశంతో పాటు భారీగా పెట్టుబడి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం కాలంలో అంతా ఆన్ లైన్ మయం అయింది. ఏది కావాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళలు ఇంట్లో ఉంచి రుచికరమైన వంటకాలు చేసి డోర్ డెలివరీ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే డోర్ డెలీవరీ కోసం భర్త సాయం లేదా ప్రత్యేకంగా వ్యక్తిని లేదా వారే అందించడానికి ఆస్కారం ఉంటుంది.

    అయితే రుచికరమైన వంటకాలు తెలియాలంటే ముందుగా వాటిని పరిచయం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా తక్కువ ధరకే వినియోగదారులకు అందించి వారిని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రుచికి అలవాటు పడిన వారు మరోసారి ఈ వంటకాల కోసం ఎదురుచూస్తారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన పదార్థాలకు అవసరమైన ముడి పదార్థాలు మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందువ్లల ఇల్లు చూసుకుంటూ వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.