Men Mistakes: ప్రతి ఒక్కరి జీవితంలో సంబంధాలు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాన్ని భట్టి వారి జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రియమైన వారితో సత్సంబంధాలు కలిగి ఉంటేనే వారు ప్రేమను చూపుతారనేది నిత్య సత్యం. చాలా సంఘటనల్లో ప్రేమికులు ఎంతో ఆప్యాయంగా ఉండి.. ఆ తరువాత కొన్ని రోజులకే విడిపోతుంటారు. ఇలాంటి వాటిల్లో ఎన్నో కారణాలు ఉన్నా.. ప్రధానంగా అమ్మాయికి నచ్చని కొన్ని పనులను అబ్బాయిలు చేయడం వల్లేనని కొందరు మానసిక నిపుణులు చెబుతున్నారు. పురుషులు తమ ప్రియమైన వారి కోసం కొన్ని పనులు చేయకపోవడం వల్లే అమ్మాయిలు వారిని రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ఈ విషయాల్లో మగవాళ్లు తప్పులు చేస్తున్నారని అంటున్నారు. అవేంటంటే?
సమయానికి కలవకపోవడం..
ప్రేమలో పడిన ప్రతి ఒక్క అమ్మాయి తన ప్రియుడితో కలిసి ఆనందంగా ఉండాలనుకుంటుంటుంది. ఇందులో భాగంగా సరదాగా పార్కుల్లో, సినిమాలకు వెళ్లాలనుకుంటుంది. అలాగే కాఫీ షాపులకు రమ్మని ఆహ్వానిస్తుంది. కానీ కొందరు అబ్బాయిలు వారి సెట్ చేసిన టైంకు రీచ్ అవరు. పలు కారణాలతో తమ గర్ల్ ఫ్రెండ్ చెప్పిన సమయానికి అమెను కలవకపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోతుంది. దీంతో ప్రియుడిపై వ్యతిరేక భావన ఏర్పడుతుంది. అయితే కొందరు అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో హెచ్చిరిస్తారు. అయినా అబ్బాయిలు పట్టించుకోకపోవడంతో వారు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భావోద్వేగాలను హేళన చేయడం..
అమ్మాయిలు సున్నిత మనస్కులు. ప్రతి చిన్న విషయాకిని ఆందోళన చెందుతుంటారు. ఒక్కో క్రమంలో వారు తమ బాధను కన్నీళ్లతో చెప్పుకుంటారు. అయితే కొందరు అబ్బాయిలో వారు పడే బాధను అర్థం చేసుకోకుండా హేళన చేస్తారు. అంతేకాకుండా వారికి నచ్చని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో.. అలాంటి వారికి దూరంగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వారి కోసం మరో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతారు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం..
జీవిత భాగ్వామితో ప్రతి విషయాన్ని పంచుకోవడం పురుషుడి బాధ్యత. అయితే కొన్నింటిని వారు తమ సహచరిణితో పంచుకోరు. పైగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రియమైన వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి సమయంలో మగవాళ్లపై ఆడవారి ప్రేమ తగ్గుతుంది. ఇది గుర్తించక ఇలాగే కొనసాగితే అసహ్యించుకొని వారికి దూరంగా ఉంటారు.
అమ్మాయిల స్నేహితల విషయంలో..
కొంత మంది పురుషులు తెలిసో తెలియకో.. ప్రియమైన వారి కంటే వారి పక్కనున్న వారిపై ఆసక్తి చూపుతారు. వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు. కొందరు అమ్మాయిలో తమ ప్రాణ స్నేహితురాలైతే పెద్దగా పట్టించుకోరు. కానీ చాలా వరకు తమను కాదని ఇతర అమ్మాయిని పొగడడం వల్ల తనకు కోపం వచ్చి అబ్బాయిలపై అసహించుకుంటారు. ఆ తరువాత విడిపోవడానికి కూడా వెనుకాడరు.
అందువల్ల ప్రియమైన వారితో కొన్ని విషయాల్లో సున్నితంగా ప్రవర్తించడం చాలా అవసరం. అంతేకాకుండా వారి విషయంలో తీసుకునే నిర్ణయాలపై ఒకటి రెండు సార్లు ఆలోచించడం మరీ ఉత్తమం. లేకుంటే వారి ఆగ్రహానికి గురై ఆ తరువాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.