Winter Healthy Foods: ప్రస్తుత శీతాకాలంలో చలి పంజా విసురుతోంది. సాయంత్రం నుంచి ముసురుతున్న చలి… తెల్లవారుజాము వచ్చే సరికి తీవ్రంగా ఉంటుంది. ఇక ఉదయం తొమ్మిది తరువాత కానీ చలి తీవ్రత తగ్గడం లేదు. మరోపక్క కరోనా వైరస్ లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ సైతం తగ్గేదే లే అంటుంది. దీంతో ఒకపక్క చలి.. మరోపక్క ఒమిక్రాన్ నుంచి బయపడాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందు కోసం రోగనిరోధక శక్తిని పెంపొందించే పండ్లు, ఆహారాలను డైలీ మన మెనూలో చేర్చుకుంటే సరిపోతుంది. అవి ఏంటో ఓసారి చూద్దాం..

రాగులు- కొర్రలు
శీతాకాలంలో చలి నుంచి మన శరీరాన్ని కాపాడటంలో కీలక పాత్ర వహిస్తాయి రాగులు-కొర్రలు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో సులువుగా జీర్ణమై శరీరానికి అవసరమైన శక్తి, వేడిని వెంటనే అందిస్తాయి.
చిలగడ దుంప(గెనిసి గడ్డ)
విటమిన్ ఎ, పొటాషియం, ఇతర పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులోనూ ఫైబర్ ఎక్కవగా ఉండడంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులో ఉండే అల్సర్లు, మంటను తగ్గించడంలో చిలగడ దుంప బాగా పనిచేస్తుంది. బీటా కెరోటిన్ కోసం ప్రతి ఒక్కరు చిలగడదుంప ముక్క తింటే సరిపోతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. చిలగడ దుంపను కూర చేసుకోవచ్చు లేదా కాల్చి కూడా తీసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో దీన్ని గెనిసి గడ్డ అని కూడా పిలుస్తారు.
నెయ్యి
ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. అతి తేలికగా జీర్ణమైయ్యే వాటిలో ఇది ఒకటి. నెయ్యి తీసుకున్న వెంటనే శరీరానికి వేడి, శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో నెయ్యిది ప్రధాన పాత్ర. అలాగే చర్మం పొలుసుబారిపోకుండ ఉండటానికి నెయ్యిని ఆహారంలో తీసుకుంటే సరి.
ఉసిరి
ఇది సిట్రస్ జాతికి చెందినది. ఇందులో సి-విటమిన్ పుష్కలంగా లభిస్తోంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు ఉసిరి తింటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఉసిరిని ఊరగాయ, రసం, చట్నీ లేదా పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఖర్జూరం..
ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఖర్జూరాలను అనేక రకాలుగా వినియోగిస్తున్నారు. కేక్‌లు మొదలుకొని షేక్స్ వరకు వీటని వినియోగిస్తున్నారు. అలాగే వీటిలో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాల బలంగా ఉండాలంటే ఖర్జూరాలను తినాల్సిందే. అలాగే ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఖర్జూరాలను నిత్యం తీసుకోవడం మంచిది.
Also Read: అరటి పండుతో పాటు మిగిలిన పండ్లను ఒకే చోట పెడుతున్నారా.. ఇది తెలిస్తే ఇకపై ఆ తప్పు చేయరు!
బెల్లం
ఇందులో ఐరన్ పాలు ఎక్కువ. బెల్లం తినేవారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ , జలుబు వంటి వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలు బెల్లంలో ఉన్నాయి.
బ్రోకలీ..
బ్రోకలీ రోగనిరోధక శక్తికి మంచి ఆహారం. ఒక కప్పు బ్రోకలీ ఆరెంజ్ పండుతో సమానం. బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బ్రోకలీని ఉడికించి తినడం మంచింది. అలాగే అల్లం కూడా రోగనిరోధక శక్తి పెంపొందించడానికి సహాయపడుతోంది. చలికాలంలో తరచూ గొంతు నొప్పి బాధిస్తుంది. దీంతో అల్లం రసం తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఇలా పైన చెప్పిన వాటిని నిత్యం ఆహారంలో తీసుకుంటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Also Read: ముల్లంగి ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు తినకూడదట!