Zodiac signs: కొత్త ఏడాది ప్రారంభంకాగానే ప్రతి ఒక్కరు ఈ ఏడాది వారి జాతక చక్రాలు రాశి ఎలా ఉందో చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కొన్ని రాశుల వారికి వివాహ యోగం ఉండగా మరి కొందరి పరిస్థితి ఏవిధంగా ఉందో ఇక్కడ తెలుసుకుందాం…
వృషభం: ఈ రాశివారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఎదురు చూడటం మానేసి ఆ సమయాన్ని మీరే సృష్టించుకోవాలి. ఈ క్రమంలోనే మీలో ఉన్నటువంటి ఈ భయాందోళనలు తొలగించి మీ ప్రేమను వ్యక్తపరచండి.
మిధునం: ఇన్నిరోజులు ఒంటరిగా గడుపుతున్న మిధున రాశి వారు ఈ ఏడాది మధ్యలో తన జీవిత భాగస్వామిని చేరుకుంటారు. అయితే వారితో కలిసి పోవడం కోసం మిధున రాశి వారు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
కర్కాటకం: కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఒంటరిగా గడుపుతున్న వారు తన తోడును వెతుక్కుంటారు. అయితే వీరిద్దరి మధ్య సరైన అవగాహన లేకపోవడంతో వీరి మధ్య బంధం వికసించదు.
సింహం: సింహ రాశి వారికి ఈ ఏడాది సంపూర్ణమైన ప్రేమను పొందగలుగుతారు. ఈ ఏడాది ఈ రాశి వారు తమ మనసుకు నచ్చిన వారిని వారి ప్రేమికులను కలుసుకుంటారు. అయితే వారికి ఇష్టమైన వారిని కలుసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కన్య: కన్యా రాశి వారు వారి మనసుకు నచ్చిన వ్యక్తిని ఎంతో సులభంగా కలుసుకుంటారు అయితే వీరిద్దరూ కలిసిన తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.
తుల: తులారాశి వారు వారి జీవిత భాగస్వామిని చేరుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎన్నో భావోద్వేగపరంగా, లక్ష్యానికి అనుగుణమైన, కెరీర్‌కు అనుకూలంగా ఉండే వారి కోసం అన్వేషించాలని ఉంటుంది.
వృశ్చికం:ఇప్పటివరకు ఈ రాశి వారు ఎంతో మంది అవివాహితులుగా ఉంటారు అయితే అలాంటి వారు భవిష్యత్తులో తమ తోడును వెతుక్కుంటారు. చక్కని అభిరుచులు కలిగిన వంటి వారితో వీరు సంబంధం ఏర్పరచుకుంటారు.
ధనస్సు: ధనస్సు రాశి వారు ఎంతో తేలిక సహనంతో ఉంటారు. ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి ఈ ఏడాది వివాహ సూచనలు కనబడుతున్నాయి.
మకరం: ఇప్పటివరకు వ్యాపారం ఉద్యోగాలలో బిజీగా ఉంటూ వంటరిగా గడిపిన మకర రాశి వారికి ఈ ఏడాది కూడా ఒంటరి జీవితమే కనబడుతుంది. ఈ ఏడాది వీరికి పెళ్లి అయ్యే సూచనలు లేవు.
కుంభం: కుంభ రాశికి చెందిన అవివాహితులు ఈ ఏడాది వారి ఒంటరితనానికి స్వస్తిపలికి వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.
మీనం: మీన రాశి వారికి ఈ ఏడాది ఎన్నో సమస్యలు వెంటాడతాయి కెరియర్ లో ఏర్పడే ఇబ్బందులు కాకుండా కుటుంబంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వీరు జీవితంలోకి సరైన వ్యక్తి ప్రవేశిస్తారు.