కేరళలో మరో ముగ్గురికి జికా వైరస్

కేరళలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే జికా వైరస్ కూడా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. అక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకటి రెండు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో జికా వైరస్ చాపకింద నీరులా రాష్ట్ర మంతటా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా సోమవారం మరో ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం జికావైరస్ కేసుల సంఖ్య 51కి పెరిగింది. అయితే వారిలో ఇప్పటికే 46 […]

Written By: Velishala Suresh, Updated On : July 26, 2021 7:46 pm
Follow us on

కేరళలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే జికా వైరస్ కూడా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. అక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకటి రెండు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో జికా వైరస్ చాపకింద నీరులా రాష్ట్ర మంతటా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా సోమవారం మరో ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం జికావైరస్ కేసుల సంఖ్య 51కి పెరిగింది. అయితే వారిలో ఇప్పటికే 46 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం అక్కడ కేవలం ఐదుగురిలో మాత్రమే జికా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.