YSR Kadapa District: ఏపీలో( Andhra Pradesh) ఒక జిల్లా పేరు మారింది. పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తిరిగి పాత పేరుతోనే కొనసాగించాలని భావిస్తోంది. వైసిపి హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని జిల్లాలకు కొత్తగా పేర్లు పెట్టారు. అలా పెట్టినదే వైయస్సార్ కడప. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి సేవలందించారు. దీనిని గుర్తిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైయస్సార్ పేరును జత చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కడప పేరును తొలగించి వైయస్సార్ జిల్లాగా నామకరణం చేసింది. అయితే సుదీర్ఘ చరిత్ర కలిగిన కడప పేరును తొలగింపు పై ప్రజల నుంచి అభ్యంతరాలతో పాటు ఆగ్రహాలు వ్యక్తం అయ్యాయి. అయినా సరే నాడు జగన్ లెక్క చేయలేదు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి సర్కార్ తిరిగి కడప పేరును జతచేస్తూ వైయస్సార్ కడప జిల్లాగా మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Vallabhaneni Vamsi : ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల!
* ఆధ్యాత్మిక నేపథ్యం..
కడపకు( Kadapa ) సుదీర్ఘ ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప ఉంది. శ్రీనివాసుడు వెలసిన గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మత్స్య అవతారంలో ఆవిర్భవించాడని ప్రసిద్ధి. అటు తరువాత కృపాచార్యులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని.. హనుమత్ క్షేత్రమైన ఈ క్షేత్రంలో బస చేశారని.. అక్కడ నుంచి తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకున్నారు అని.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ముందుకు సాగలేకపోయారు. అయితే శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తప్పించి పోయారు. చివరకు స్వామి సాక్షాత్కారాన్ని పొందారు. అప్పటినుంచి కృపాచార్యులు శ్రీవారి కృప పొందిన ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా..కుడపగా క్రమేపీ కడపగా ప్రసిద్ధి చెందింది అని ఇక్కడి వారు చెబుతుంటారు.
Also Read: 30 years of grudge against CBI: సిబిఐ మీద 30 ఏళ్ల పగ.. ఈ రైల్వే మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే?
* శ్రీవారి గడపగా గుర్తింపు..
తిరుమల( Lord Tirumala ) శ్రీవారి గడపను కడపగా పేర్కొంటారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే దీనిని లెక్కలోకి తీసుకోకుండా.. చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరును వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్సార్ జిల్లాగా మార్చేసింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రజాసంఘాలతో పాటు రాజకీయ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సత్య కుమార్ యాదవ్ ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే కూటమి ప్రభుత్వం వివాదం లేకుండా వైయస్సార్ పేరును ఉంచుతూనే.. దానికి కడప ను జత చేసింది. వైయస్సార్ కడప జిల్లాగా మార్చి ఉత్తర్వులు జారీచేసింది. ఇకనుంచి వైయస్సార్ కడప జిల్లా గానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి ఇది షాకింగ్ పరిణామమే.