OG Release Date : ఇప్పటివరకు భారీ సినిమాలను తీస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన బిజీగా ఉండడం వల్ల ఆయన వరుస సినిమాలను చేయలేకపోతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానాన్ని కల్పించాయి. ఆయన చేసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu)సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ (OG) సినిమాని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సుజీత్ (Sujeeth) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా ఉండబోతుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
ఇక సినిమా యూనిట్ నుంచి రీసెంట్ గా రిలీజ్ డేట్ ను సైతం అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే రీతిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 30% షూట్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే మిగిలిన ఆర్టిస్టుల షూటింగ్ కూడా కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ అయితే ఉన్నారు మరి వాళ్ళు అనుకున్నట్టుగా సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగితే సినిమా అనుకున్న డేట్ కి రావడమే కాకుండా పలు రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది అంటూ మరికొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి చాలామంది హీరోలు పోటీ పడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి హీరో సైతం భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూ పాలిటిక్స్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో సైతం భారీ సక్సెస్ ను సాధించాలని తన అభిమానులు సైతం కోరుకుంటున్నారు…