youth movie review, : కంటెంట్ బాగుంటే చాలు , ఎంత చిన్న హీరో సినిమాకు అయినా , స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ ని అందిస్తున్నారు ఆడియన్స్. అలా రీసెంట్ గా కెన్ కరుణాస్(Ken Karunas) అనే యువ తమిళ హీరో నటించిన ‘యూత్'(Youth Movie) అనే చిత్రం , ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. అయినప్పటికీ ముందస్తుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తో ముందుగా కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం , ఈ చిత్రాన్ని నేడు విడుదల చెయ్యాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తమిళం తో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా స్టోరీ , విశ్లేషణ వగైరా వంటి అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
కథ :
అల్లరి చిల్లరిగా తిరిగే మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ కుర్రాడు ప్రవీణ్ (కెన్ కరుణాస్) కి సంబంధించిన కథ ఇది. ఇతని వాలకం , వేషాలు చూసి స్కూల్ లో ఏ అమ్మాయి కూడా ఇతని వైపు చూడడు. ఎలా అయినా స్కూల్ పూర్తి అయ్యేలోపు ఒక్క అమ్మాయిని అయినా పడేయాలని అనే పట్టుదలతో ఉన్న ఈ కుర్రాడి జీవితం లోకి గంగవల్లి (అనీషా అనిల్ కుమార్ ), ప్రేషిక (మీనాక్షి దినేష్) సోనాల్ (ప్రియాంషీ యాదవ్) వస్తారు. ఈ ముగ్గురి కారణం ప్రవీణ్ తన జీవితం లో ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నాడు, బ్రేకప్ సంఘటనలు జరిగిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి?, తండ్రి కోరికకు తగ్గట్టుగా బాధ్యతలు తెలుసుకొని చదువు మీద ఫోకస్ పెడుతాడా లేదా? వంటివి తెలియాలంటే వెంటనే నెట్ ఫ్లిక్స్ ని ఓపెన్ చేసి ఈ సినిమాని చూసేయండి.
విశ్లేషణ :
ప్రతీ మనిషి జీవితం లో టీనేజ్ లైఫ్ కి ఎంతో ప్రాముఖ్యుత ఉంటుంది. జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు ఈ టీనేజ్ లైఫ్ లోనే ఉంటాయి. ఆ వయస్సులో మనం చేసిన అల్లరి , నడిపిన లవ్ ట్రాక్స్ , వాటి నుండి నేర్చుకున్న పాఠాలను ఇప్పటికీ మనం మరచిపోలేము. అలాంటి జ్ఞాపకాలతోనే కెన్ కరుణాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతే కాకుండా, కుటుంబ సంబంధాలు , ఎమోషన్స్ ని కూడా జోడించి , ప్రేక్షకులకు థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి అనుభూతి కలిగించేలా చేశాడు . ఈ చిత్రం లో నటుడిగా , దర్శకుడిగా కెన్ కరుణాస్ ప్రతిభ అద్భుతంగా అనే చెప్పాలి. ఈ సినిమాని చూస్తున్నంతసేపు కచ్చితంగా మన టీనేజ్ జీవితం లోని మధుర జ్ఞాపకాలు మన కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంటాయి. ఈ వీకెండ్ కి మంచిగా టైం పాస్ అయ్యే చిత్రం , మిస్ అవ్వకుండా చూడండి.