
పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. పరుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్విందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్ కు తొలి పతకం అందించిన అథ్లెట్ గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది వరకు 2018 ఆసియా పారా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సాధించిన హర్విందర్ ఇప్పుడు విశ్వ క్రీడల్లోనూ సత్తా చాటాడు. కొరియన్ అథ్లెట్ కిమ్ తో కాంస్య పోరులో హర్విందర్ గెలుపొందాడు.