
Teenmar Mallanna Case: క్యూన్యూస్ చీఫ్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న(Teenmaar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కేసు విచిత్ర మలుపులు తిరుగుతోంది. ప్రశ్నించే గొంతుకల్ని పిసకడం ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగ వార్తలు ప్రసారం చేస్తున్నారనే అక్కసుతో మల్లన్నపై కేసు నమోదు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో స్టే విధించలేమని హైకోర్టు తెలపడంతో కేసు ఏ మలుపు తిరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ పై బెదిరింపులు, ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారనే ఉద్దేశంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మల్లన్న కుటుంబ పరిస్థితి బాగా లేకపోయినా ఆయన సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. మల్లన్న భార్య ముత్తమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కోర్టు విచారణకు స్వీకరించింది.
తీన్మార్ మల్లన్నపై నమోదైన 306,511 సెక్లషన్లను ఎత్తివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగులో ఉందని స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులో పూర్తి ఆధారాలతో కౌంటలు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మల్లన్న కేసు కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
ప్రభుత్వం మల్లన్న కేసును పటిష్టంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఆయన జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకు సెక్షన్లు బలంగా ఉండాలని పెట్టినట్లు సమాచారం. రాష్ర్టంలో కొనసాగే అక్రమాలను వెలికితీసేందుకు ప్రయత్నించారనే అక్కసుతోనే మల్లన్నను జైల్లోకి పంపించినట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం తన పని సులువుగా చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం