
వైసీపీ పాలనలో అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్ల దుస్థితి ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారుల వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయన్నారు. ఈ రోడ్లు దెబ్బతిన్నా ప్రభుత్వం బాగు చేయడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు చేయాలని వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామంటూ పవన్ పలుపునిచ్చారు.