
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత లవ్లీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షలకులను అలరించాడు. ఇప్పుడు అతిథి దేవోభవ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంది. అద్దాన్ని దాటుకొని పోయేందుకు హీరో ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుండగా, ఇందులో అంతర్యం ఏంటనే దానిపై అభిమానులు లోతుగా ఆలోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా.. సువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది.