కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్(Ajith Kumar). తన సినిమాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను రంజింపచేస్తుంటాడు. తెలుగులో కూడా అజిత్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. అజిత్(Ajith Kumar) ఎలాంటి వివాదాలకు పోకుండా కుటుంబంతోనే గడుపుతుంటారు. ఇటీవల ఓ మహిళ అజిత్ పై ఓ అభియోగం మోపింది. తన చావుకు కారణం ఆయనే అంటూ పేర్కొంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అనేక విషయాలు తెలిశాయి. ఆమె పేరు ఫర్జానా అని తెలిసింది. ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గత సంవత్సరం కరోనా సమయంలో అజిత్(Ajith Kumar), షాలిని ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఫర్జానా అజిత్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దీంతో అప్పుడు అజిత్ కు కరోనా సోకిందనే పుకారు వచ్చింది.
దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో అజిత్ యాజమాన్యంతో మాట్లాడితే తిరిగి తన ఉద్యోగం తనకు వస్తుందని పలుమార్లు కలవాలని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్యే శరణ్యమని భావించి పెట్రోల్ పోసుకునేందుకు నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఆమెను అడ్డుకుని కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని సలహా మాత్రం ఇచ్చారు. కానీ తన ఉద్యోగం విషయం మాత్రం ఇంకా తేలలేదని తెలుస్తోంది.