
MAA Elections 2021: నటుడు, దర్శకుడు రవిబాబు రెగ్యులర్ సినిమా మనిషి కాదు, పైగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబంధించి గతంలో ఎప్పుడూ యాక్టివ్ గా లేడు. కానీ, ఉన్నట్టు ఉండి సడెన్ గా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ‘మా’ సంస్థ మన కోసం మనం పెట్టుకున్నాం. మరి మన కోసం పని చేయడానికి మనలో ఒకడు కూడా పనికి రాడా?’ ఇది రవిబాబు స్పీచ్ లో ప్రధాన పాయింట్.
‘మా’ ఎన్నికల్లో (MAA Elections 2021)ఎక్కువగా ఓట్లు వేసేది చిన్నాచితకా నటీనటులే. తన సినిమాల్లో వాళ్ళను మాత్రమే పెట్టుకోవడం రవిబాబు ప్రత్యేకత. అందుకే చాలామంది చిన్న చిన్న నటీనటులు రవిబాబును ఎంతగానో గౌరవిస్తారు. ఇక్కడ మంచు విష్ణు తెలివిగా ముందుకు వెళ్ళాడు. ‘మా’ ఎన్నికల్లో ఓట్లు వేసే వారి బలహీనతల్లో ముఖ్యమైనది సినిమా అవకాశాలు.
ప్రకాష్ రాజ్ లాంటి నటులు చిన్న నటులకు ఎన్నడూ అవకాశం ఇప్పించిన సంఘటన లేదు. కానీ, రవిబాబు చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు. అందుకే మంచు విష్ణు, రవిబాబును ఫ్రేమ్ లోకి తీసుకొచ్చాడు. అందుకు తగ్గట్టుగానే రవిబాబు స్పీచ్ కూడా చిన్న నటీనటులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా ఉంది. ఇంతకీ రవిబాబు ఏమి మాట్లాడాడు అంటే..
‘అందరికీ నమస్కారం, ఇది లోకల్ నాన్ లోకల్ వివాదం గురించి కాదు, నేను ఏదో ఒక ప్యానల్ కు ఓటు వేయండి అని కూడా చెప్పట్లేదు. మనకు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నా.. సినిమాలు చేసే మన మన దర్శక నిర్మాతలు డబ్బింగ్ రైట్స్, అలాగే వేరే కొన్ని కారణాలు కారణంగా బయటవాళ్లకే ముఖ్యంగా వాళ్ల డిమాండ్ లకు ఒప్పుకొని మరీ ఎక్కువగా అవకాశాలిస్తున్నారు’ అని అన్నాడు. ఇది ప్రకాష్ రాజ్ లాంటి నటుల గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పిందే.

అలాగే రవిబాబు (Ravi Babu) ఇంకా మాట్లాడుతూ.. ‘అది వాళ్ళ అదృష్టం. మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల దురదృష్టం అనుకుందాం. కానీ కెమెరామెన్ లు, మేకప్ మేన్‌లు.. ఇలా సినిమాకు సంబంధించిన చాలా చిన్న చిన్న విభాగాల్లో కూడా బయటవాళ్లకే ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు’ కచ్చితంగా ఇది నాన్ లోకల్ పై వ్యతిరేకతను పెంచడానికే రవిబాబు ఇలా మాట్లాడాడు.
‘సరే ఇవన్నీ పక్కన పెడితే.. నటీనటుల సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. ఇది మన కోసం మనం పెట్టుకున్నాం. దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా ? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు చాలా తెలివిగా ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మాట్లాడాడు. రవిబాబు ఎంట్రీ విష్ణు చాలా ప్లస్ కానుంది. మొత్తానికి రవిబాబుతో విష్ణు తెలివిగా ప్రకాష్ రాజ్ ను దెబ్బ కొట్టాడు.