
దేశంలో ఆక్సిజన్ సంక్షభం కొనసాగుతున్నది. ప్రాణవాయువు అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గోవాలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం నాలుగు గంటల వ్యవధిలో ప్రాణవాయువు అందక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయమే కారణమని తెలుస్తోంది. ఘటనపై విచారణ జరపాలని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే బాంబే హైకోర్టును కోరారు. కొవిడ్ రోగుల మరణాలపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగినంత ఆక్సిజన్ ఉందని తెలిపారు.