
న్యాయస్థానాలు జరిపే విచారణపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీకంకోర్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడే విచారణ జరగాలి. కోర్టుల్లో విచారణలపై పూర్తి విశ్వాసం ఉంచాలి అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.