
వినాయక చవితి పండగను ఇంట్లోనే జరుపుకోవాలన్న జీవోను ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బార్లు, సినిమాహాళ్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా? అని నిలదీశారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. ఏపీలో హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 150కి పైగా ఇటువంటి ఘటనలు జరిగిన అరెస్టులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.