
చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్ తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ 79 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియంజెలా సిమో పేర్కొన్నారు. కొవాక్స్ ఫెసిలిటీలో పాల్గొని, మరింత సమానమైన వ్యాక్సిన్ పంపిణీ లక్ష్యానికి దోహదం చేయాలని మేం తయారీదారుడిని కోరుతున్నట్లు తెలిపారు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ అనుబంధ బీజింగ్ బయో ఇన్స్ ట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ కో లిమిటెడ్ సినోఫార్మ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తుంది.